ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం, హిందూ మహాసముద్రం మీద ఉన్న అల్పపీడన ప్రాంతం, దాని అనుబంధ ఉవపరితల ఆవర్తనం సగటు సముద్రానికి 5.8 కిమీల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతున్నది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం కొనసాగించి, ఆ తర్వాత డిసెంబర్ 11వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతం వద్ద ఉన్న శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
ఈరోజు, రేపు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ:-
ఈరోజు, రేపు:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
Amaravati News Navyandhra First Digital News Portal