ఇక 9, 10 తరగతి విద్యార్ధులకు ‘తెలుగు సబ్జెక్ట్‌’ తప్పనిసరేం కాదు.. విద్యాశాఖ ఉత్తర్వులు

SSC మినహా మిగతా బోర్డులకు సంబంధించిన పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఈ నిబంధనను కేవలం 8వ తరగతి వరకు మాత్రమే అమలు చేయాలని, 9, 10 తరగతులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది..

తెలంగాణ రాష్ట్రంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఇతర బోర్డుల్లో 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్‌ కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. ప్రస్తుత (2024-25), వచ్చే విద్యా సంవత్సరం (2025-26) తొమ్మిదవ, పదో తరగతి చదివే విద్యార్ధులు తెలుగును ఒక సబ్జెక్టుగా చదవడంపై మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2018-19 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి వరకు పాఠశాల విద్యార్ధులు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తూ చట్టం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చట్టం సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ ఇతర బోర్డుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే అమలు చేస్తున్నారు. 9, 10 తరగతుల విద్యార్ధులు చదవడం లేదు. కేవలం ఐదు సబ్జెక్టులే చదువుతున్నారు. భాషా సబ్జెక్టుల్లో ఆంగ్లం, హిందీ మాత్రమే వీరంతా అభ్యసిస్తున్నారు. ఇతర బోర్డుల్లో తెలుగు మాతృభాష కానివారు కూడా అధిక సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఆ సబ్జెక్టులో తప్పనిసరిగా పాస్‌ కావాలంటే ఇబ్బందులు వస్తాయని భావించిన విద్యాశాఖ 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు అమలును మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

క్లాట్‌ 2025 ర్యాంకు కార్డులు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2025 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్‌ లేదా అడ్మిట్‌ కార్డు నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోరు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 141 పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్‌ 1వ తేదీన క్లాట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు డిసెంబర్ 9న అందుబాటులో రానున్నాయి. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో యూజీ, పీజీ డిగ్రీ ప్రోగ్రాలలో (ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 24 ప్రధాన లా యూనివర్సిటీలు ఇందులో పాల్గొంటున్నాయి. కాగా ఆలిండియా స్థాయిలో ఏటా కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివేందుకు అవకాశం ఉంటుంది.

About Kadam

Check Also

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కలెక్టర్‌ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *