మోహన్ బాబు ఇంటి చుట్టూ బౌన్సర్లు.. 30 మందిని దింపిన మనోజ్

మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్‌ . మంచు ఫ్యామిలీలో ఫైటింగ్‌ రచ్చగా మారింది. మోహన్‌బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను పంపారు మంచు విష్ణు, మంచు మనోజ్‌. కాసేపట్లో మోహన్‌బాబు ఇంటికి వెళ్లనున్నారు మంచు విష్ణు. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి .

మంచువారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్‌బాబు కుమారులు మంచు విష్ణు-మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే.. మనోజ్‌ 30 మంది బౌన్సర్లను దింపాడు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్ చేరుకున్న విష్ణు కాసేపట్లో మోహన్‌ బాబు ఇంటికి వెళ్లనున్నారు. మంచు మనోజ్‌ ఇంటికి వెళ్లిన విష్ణు బిజినెస్ పార్ట్‌నర్ విజయ్‌.. సీసీటీవీ హార్డ్‌ డిస్క్‌ తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు మనోజ్‌ ఇంటిపై విష్ణు నిఘా పెట్టారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు.

నిన్న( ఆదివారం) మంచు మనోజ్‌ గాయాలపాలయ్యారు. అయితే మనోజ్‌ను ఎవరు కొట్టారు.? ఎందుకు కొట్టారన్నది బయటకు రాలేదు. మెడికో లీగల్ రిపోర్ట్‌లో మంచు మనోజ్ ఒంటిపై గాయాలున్నట్టు తేల్చారు వైద్యులు. వెన్నుముక, మెడపైనా గాయాలైనట్లు రిపోర్ట్‌ ఇచ్చారు. మంచు లక్ష్మి మనోజ్‌ ఇంటికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు.

ఆస్తుల పంపకాల సందర్భంగా మంచువారింట్లో గొడవలు జరిగాయన్న వార్తలను కొట్టిపారేశారు మోహన్ బాబు. మంచు విష్ణుకు మంచు మనోజ్‌కు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. అన్నదమ్ముల సవాళ్లు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ పోటీపడి బౌన్సర్లను తెచ్చుకోవడంతో అసలు మంచు ఇంట్లో మంటలకు కారణమేంటన్నది టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

About Kadam

Check Also

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు!

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *