స్కానింగ్ సెంటర్‌ నుంచి కేకలు వేస్తూ బయటకు వచ్చిన యువతి.. ఆరా తీయగా

ఆమెకు యాక్సిడెంట్ కారణంగా గాయాలు అయితే వైద్యుడి వద్దకు వెళ్లింది. అక్కడ స్కాన్‌కు రిఫర్ చేశారు. స్కానింగ్ కోసం సెంటర్‌కు వెళ్లగా.. ఆమెకు భయానక అనుభవం ఎదరయ్యింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి…

విశాఖలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ స్కానింగ్ సెంటర్‌లో టెక్నీషియన్ కీచక బుద్ధి బయటపెట్టాడు. డాక్టర్ రిఫర్ చేసిన ఓ యువతి స్కానింగ్‌కు కోసం రావడంతో.. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక దాడి చేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె కేకలు పెడుతూ బయటకు పరిగెత్తుకు వచ్చింది. అప్రమత్తమైన ఆమె బంధువులు.. ప్రశ్నించేసరికి లోపల జరిగిన విషయాన్ని వారితో చెప్పింది ఆ యువతి. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత బంధువులు.. స్కానింగ్ సెంటర్ టెక్నీషియన్ ప్రకాష్‌కు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు.

సిరిపురం ప్రాంతంలో యువతీ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమె సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్ పరీక్షించి స్కానింగ్ రిఫర్ చేశారు. స్కానింగ్ కోసమని వెళ్లిన ఆ యువతకి అక్కడ టెక్నీషియంతో భయానక అనుభవం ఎదురయింది. అతని ప్రవర్తన లో మార్పును గమనించింది యువతి. ఆమె ఊహించినట్టుగానే.. ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు స్కానింగ్ సెంటర్ టెక్నీషియన్ ప్రకాష్.

బాధితురాలు ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న త్రి టౌన్ పోలీసులు.. బిఎన్ఎస్ సెక్షన్ 74, 76 కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు నిందితుడిని తరలించారు.

ముఖ్యమంత్రి సీరియస్..

ఘటన తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు .. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసులు పరుగులు పెట్టారు. అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు సీఎం ఆదేశాలతో అరెస్టు చేశారు.

About Kadam

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *