చిన్న విషయానికే ఇంతలా శిక్ష వేయాలా..? మూగ జీవులపై ప్రతాపం.. టెంపుల్ సిటీలో కలకలం

టెంపుల్ సిటీ తిరుపతిలో శునకాలపై వరుస దాడుల వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది. కొందరు శునకాలపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్న తీరు భయపెడుతోంది. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో పెంపుడు కుక్క హత్యకు గురైన ఘటన మరువక ముందే.. ఓ పెంపుడు కుక్కను పైశాచికంగా కొట్టిన ఓ వ్యక్తి వ్యవహారం కలకలం రేపింది.. మూగ జీవి అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేశాడు.. విచక్షణ కోల్పోయి మరి కర్రతో ఎలా పడితే అలా కొట్టాడు.. వివరాల్లోకెళితే.. స్కావెంజర్స్ కాలనీలో లావణ్య అనే మహిళకు చెందిన పెంపుడు కుక్క మోరిగిందన్న సాకుతో కొందరు కొడవళ్ళతో నరికి చంపారు. కుక్క మర్డర్ కేసులో తిరుపతి ఈస్ట్ పోలీసులు శివకుమార్, సాయికుమార్ అనే ఇద్దర్ని అరెస్టు చేశారు.. ఈ క్రమంలోనే.. తిరుపతిలోనే మరో పెంపుడు కుక్కపై ఓ యజమాని ప్రదర్శించిన కర్కశత్వం సంచలనంగా మారింది.. మానవత్వం మరచిపోయి ఇంట్లో వున్న మూగజీవిని దారుణంగా కొట్టాడు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.. ఈ ఘటన జంతు ప్రేమికుల హృదయాన్ని కలచివేసింది.

పెంపుడు శునకాన్ని చావబాదిన దినేష్ అనే యజమాని తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎంసీఏ చదువుతున్న దాసరి మఠానికి చెందిన దినేష్ ఇంట్లో ఉన్న పలు రకాల శునకాలు ఉన్నాయి.. అయితే.. మంగళవారం ల్యాబ్ జాతికి చెందిన శునకం ఇంటి నుంచి వెళ్లిపోయింది.. జంతు ప్రేమికుడైన దినేష్ ఇంట్లోని కుక్క కనిపించకపోవడంతో కట్టలు తెంచుకునే ఆగ్రహంతో రెచ్చిపోయాడు. రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన పెంపుడు కుక్క తిరిగి ఇంటికి రావడంతో.. దానిని చూసి రాక్షసుడిగా మారిపోయాడు. శునకం పై యజమానిగా తన ప్రతాపాన్ని చూపాడు. కోపంతో ఊగిపోతూ కర్రతో చావబాదాడు.

అయితే.. పెంపుడు కుక్కను విడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మూగజీవి పట్ల దినేష్ కర్కశత్వం అందరినీ కలిసి వేసింది. కొందరు జంతు ప్రేమికులు ఈ విషయాన్ని పీపుల్ ఫర్ యానిమల్స్ చైర్ పర్సన్ మేనకా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో ఈ ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు స్పందించిన తిరుపతి ఈస్ట్ పీఎస్ సీఐ రామకృష్ణ యానిమల్ కేర్ ల్యాండ్ ప్రతినిధి డాక్టర్ శ్రీకాంత్, తిరుపతి కార్పొరేషన్ వెటర్నరీ డాక్టర్ నాగేంద్ర రెడ్డి సాయంతో తీవ్రంగా గాయపడ్డ పెంపుడు కుక్కకు వైద్య సేవలు అందించారు. ఇంట్లో నుంచి వెళ్లిన కుక్కకు పెద్ద శిక్ష వేసిన దినేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

About Kadam

Check Also

ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా కట్.. హైకోర్టు సంచలన ఆదేశాలు!

ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *