రాజమండ్రి టూ ఢిల్లీ.. 2 రోజులు కాదు.. ఇక 2 గంటలే.! వివరాలు ఇవిగో

సాధారణంగా మనం రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్లాలంటే.. బస్సు లేదా రైలులో 32 గంటల నుంచి 36 గంటల సమయం పడుతుంది. అయితే ఇకపై ఆ వర్రీ ఉండదు.. కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు.. ఆ వివరాలు..

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్‌. ఇక రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్‌ ప్రారంభమైంది. అంతకు ముందు ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చిన మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురందేశ్వరి చేరుకున్నారు. రన్‌వే పై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్‌కు వాటర్ కెనాల్స్‌తో సిబ్బంది స్వాగతం పలికారు.

ఇంతకు ముందు విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ లేదంటే విజయవాడ వెళ్లి ఫ్లైట్స్ ఎక్కాల్సి ఉండేది. ఇప్పుడు ఢిల్లీకి గాని, ముంబైకి గాని నేరుగా వెళ్లి అక్కడి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లి అవకాశం సామాన్యులకు లభించింది. కాకినాడ ఎయిర్ట్‌పోర్ట్ విషయంలో ల్యాండ్ సహా ఫిజుబిలిటీపై ఫోకస్ పెంచామంటున్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. మధురపూడి విమానాశ్రయం నుంచి మరిన్ని పట్టణాలకు కనెక్టివిటీ సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ, తిరుపతి, వారాణసీ, షిర్డీ తదితర ప్రదేశాలకు మధురపూడి నుంచి కనెక్టివిటీ సర్వీసులు కలపాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు.

About Kadam

Check Also

ప్రశాంతంగా ముగిసిన మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడో తెలుసా?

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 రోజుల పాటు జూన్ 6 నుంచి జూలై 2 వరకు జరిగాయి. దాదాపు అన్ని కేంద్రాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *