బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తా.. మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది.. అల్లు అర్జున్..

ఈ క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అనంతరం తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన బన్నీకి అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. బన్నీకి ఆప్యాయంగా స్వాగతం కుటుంబసభ్యులు. అల్లు అర్జున్ ను చూసి భార్య స్నేహరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ సినీప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి తరలివచ్చారు. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు, సుకుమార్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, హరీశ్ శంకర్ తదితరులు బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీతో మాడ్లాడుతూ డైరెక్టర్ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే మేనల్లుడిని చూసి ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ.

తాజాగా మీడియాతో మరోసారి మాట్లాడారు అల్లు అర్జున్. ‘థాంక్యూ.. నాకు సపోర్ట్ చేసిన అభిమానులకు ధన్యవాదాలు. అన్ని ఇండస్ట్రీల నుంచి నాకు వచ్చిన సపోర్టుతో జెన్యూన్ గా థాంక్స్. బన్నీ సినిమాలను, ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకు థాంక్స్. కేవలం మీడియాకు థాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను. బాధిత కుటుంబాన్ని మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. ఆ ఘటన జరగడం బాధాకరం. గత 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు ఆ థియేటర్ కు వెళ్తున్నాను. కానీ ఆ ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము.. మళ్లీ మళ్లీ చెప్తున్నా ఆ కుటుంబానికి ఏం కావాలన్నా అండగా నేనుంటాను.. అలాంటి ఘటన ఎవరు ఊహించలేదు.. నిజంగా అలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. నేను లోపల నా కుటుంబంతో పాటు సినిమా చూస్తున్న సమయంలో బయట ఈ ఘటన జరిగింది.. ఘటనకు నాకు ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు.. అనుకోకుండా జరిగిన ఘటన’ అని అన్నారు అల్లు అర్జున్. అయితే అరెస్టుకు సంబంధించిన ఏ విషయంపై కూడా స్పందించడానికి ఇష్టపడని అల్లు అర్జున్.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “మీడియా వారికి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు.. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న నేషనల్ మీడియాకు కూడా స్పెషల్ థాంక్స్. బన్నీ సినిమాలను, ఆయన సక్సెస్ ను ఎంకరేజ్ చేస్తున్న రీజనల్, నేషనల్ మీడియాకు థాంక్స్. కేవలం మీడియాకు థాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చాను” అని అన్నారు.

About Kadam

Check Also

టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ

టెట్ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *