తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ప్రిన్సిపల్ ఏం చేశారో తెలుసా..? రాగి జావా తాగి తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థినిలను ప్రిన్సిపల్ ఎలా దండించాడో తెలుసా? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది?
విద్యార్థులను కన్న బిడ్డల వలే చూసుకోవలసిన ఉపాధ్యాయులు ఈ మధ్య బరి తెగిస్తున్నారు. విద్యార్థులను సన్మార్గంలో పెట్టేందుకు సున్నితంగా దండించాల్సిన టీచర్లు రెచ్చిపోతున్నారు. రాగి జావా తాగి తరగతి గదికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థినిలను ప్రిన్సిపల్ ఏం చేశారో తెలుసా?
పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసింది. వలిగొండ మండలం వర్కట్‌పల్లికి చెందిన అఖిల, నాతాళ్లగూడెంకు చెందిన అక్షిత లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. రెండు రోజుల క్రితం వీరిద్దరూ రాగిజావ తాగేందుకు పాఠశాల ఆవరణలోకి వచ్చారు. వేడిగా ఉండటంతో విద్యార్థినులు తాగలేకపోయారు. కొద్దిసేపు ఆలస్యం కావడంతో తరగతి గదిలోకి చేరుకునే సందర్భంలో అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ రహీమున్నీసాబేగం ఇంతసేపు ఆలస్యం ఎందుకు అయిందని ప్లాస్టిక్ పైపుతో చేతులపై కొట్టారు. ప్రిన్సిపాల్ కొట్టడంతో విద్యార్థినుల చేతులపై వాపు వచ్చింది. ఆ మరుసటి రోజు విద్యార్థినుల చేతులను పరిశీలించిన ప్రిన్సిపాల్.. స్థానికంగా ఉన్న RMP వైద్యుడితో చేతికి బ్యాండేజ్ కట్టించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. తాను విద్యార్థినులను కొట్టలేదని, కేవలం వారి ఆలస్యానికి కారణాన్ని అడిగి మందలించినట్లు ప్రిన్సిపాల్ వివరణ ఇచ్చారు. క్షమించండి, మరోసారి ఇలాంటి పొరపాటు చేయను వదిలేయండి. ఆసుపత్రి ఖర్చులు భరిస్తా’ అని ప్రిన్సిపల్ సమాధానం చెప్పినట్లు తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘటనపై ఎంఈఓ విచారణ జరిపి జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదికను సమర్పించారు.