అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. బుధవారం, గురువారం, శుక్రవారం వాతావరణ పరిస్థితుల గురించి అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది.. నైరుతి బంగాళాఖాతం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగ ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఇది మరింత తీవ్రత చెంది అదే ప్రాంతంలో కేంద్రీకృతమైంది.. రానున్న 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి దాదాపు ఉత్తరం దిశగా పయనించే అవకాశం ఉంది.

రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇవే..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ;-

బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.

గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.

About Kadam

Check Also

తెలుగోడి సాహిత్య సేవకు పట్టం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న అభ్యుదయ కవి లక్ష్మీ నారాయణ

భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనది పురస్కారంగా ప్రసిద్దిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *