అంబేద్కర్ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కొత్త రగడ రాజుకుంది.. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. ఉభయసభల్లో దుమారం రేపాయి.. అమిత్ షా క్షమాపణలు చెప్పాలన్న విపక్షం డిమాండ్ చేస్తోంది.. పార్లమెంట్ ఆవరణలో అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.. అమిత్షా రాజీనామాకి పట్టుబడుతూ ఇండి కూటమి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఇండి కూటమి నిరసనలపై బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు నడ్డా గురువారం కీలక ట్వీట్ చేశారు.. నిన్నటినుంచి సత్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయాన్ని విశ్వసిస్తున్నాం అని చెప్పే కాంగ్రెస్ నేతలు.. ఆ పార్టీ తీరును బహిర్గతం చేస్తున్నారు. కాబట్టి, డాక్టర్ అంబేద్కర్ పట్ల ఉన్న లోతైన కాంగ్రెస్ ద్వేషాన్ని వివరించడానికి కొన్ని వాస్తవాలను పంచుకోవాలని అనుకున్నాను.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ కు నమస్కరిస్తున్న ఫొటోను షేర్ చేశారు..
ప్రధాని మోదీ ఎల్లప్పుడూ అంబేద్కర్ ను అనుసరిస్తారని.. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషిచేస్తారని.. మోదీకి అంబేద్కర్ అంటే ఎంత గౌరవమో ఈ ఫొటో చూపిస్తుందని పరోక్షంగా జేపీ నడ్డా ట్వీట్ లో తెలిపారు.
అంబేద్కర్ను అవమానించారంటూ ఎంపీలు ఆందోళనలు చేస్తున్నారు.. దీంతో.. దీనికి పోటీగా ఎన్డీయే సభ్యులు సైతం నిరసనకు దిగారు.. పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు.. పార్లమెంట్ భవనం ఎక్కి విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు.. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో తోపులాటలో బీజేపీ ఎంపీ తలకు సారంగికి గాయమైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. రాహుల్ గాంధీయే తనను తోసేశారంటూ బీజేపీకి చెందిన ఒడిశా ఎంపీ ప్రతాప్ సారంగి ఆరోపిస్తున్నారు.. అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్సేనంటూ బీజేపీ ఎంపీలు కూడా పోటాపోటీగా నిరసనకు దిగడంతో పార్లమెంట్ ఆవరణ నిరసనలతో దద్దరిల్లుతోంది..
కాగా.. పార్లమెంట్లోకి వెళ్లన్వికుండా తమను అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ ఎంపీల తనను చేతులు అడ్డుపెట్టి అడ్డుకున్నారని చెబుతున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా అడ్డుకున్నా.. తాము వెనక్కి తగ్గం అన్నారు రాహుల్ గాంధీ..
.