హైకోర్టులో ఏసీబీ కేసుపై కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌.. విచారణ ఎప్పుడంటే?

ఫార్మూలా ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ కేసును క్యాష్ చేయాలని, బోజనం తర్వాత తన పిటిషన్‌పై విచారణ చేయాలని కోర్టును కోరారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.

మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో ఫార్మూలా ఈ రేసు వ్యవహారంలో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఏసీబీ ఈ ఫార్మూలా రేసు వ్యవహరంలో కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా ఆయన హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని కేటీఆర్ కోర్టును కోరినట్లు తెలుస్తుంది.

ఫార్ములా ఈ కార్ రేసింగ్‌‌లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటినుంచో కేటీఆర్ ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే తాజాగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేటీఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఎఎస్ అధికారి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌, A3గా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఫార్ములా ఈ ఆర్గనైజర్స్ (ఎఫ్‌ఓఈ) అనే విదేశీ కంపెనీకి హెచ్‌ఎండీఏ రెండు దఫాలుగా రూ.45 కోట్లు చెల్లించిందని ఏసీబీ ఆరోపించింది. అనధికారిక లావాదేవీలకు సంబంధించి అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.8 కోట్ల జరిమానా విధించిందని , ఆ తర్వాత గత ఏడాది చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని చెల్లించిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఫార్ములా ఈ రేసుపై శాసనసభలో చర్చ జరగాలని, దీంతో అసలు ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు.

2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని కేటీఆర్ వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. హైదరాబాద్ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ఈ రేసును నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

About Kadam

Check Also

రతన్ టాటా రూ.15 వేల కోట్లు ఎవరికి వస్తాయి? వీలునామాలో ఎవరి పేర్లు ఉన్నాయి?

రతన్‌టాటా ప్రస్తుతం మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *