యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్షల తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, పీహెచ్‌డీ ప్రవేశాలకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించే యూజీపీ నెట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా యమ డిమాండ్ ఇంటుంది. అందుకే ప్రతీయేట ఈ పరీక్షను రెండు సార్లు యూజీపీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్షల తేదీలను ఇప్పటికే యూజీపీ ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి..

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష తేదీలు మారాయి. ఈ మేరకు మారిన పరీక్ష తేదీలతోపాటు పరీక్షల షెడ్యూల్‌ను యూజీసీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. అందుకే యేటా రెండు సార్లు యూజీసీ నెట్‌ పరీక్షలు నిర్వహిస్తుంది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనుంది. కాగా యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 19 నుంచి డిసెంబర్‌ 10 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. త్వరలోనే అడ్మిట్‌ కార్డులను యూజీసీ విడుదల చేయనుంది.

కాగా యూజీసీ- నెట్‌ పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. పేపర్‌ 1లో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. మొత్తం 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. పేపర్‌ 2లో 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష 3 గంటల వ్యవధిలో ఉంటుంది. పేపర్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌ననెస్‌ వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఇక పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజెస్‌ సబ్జెక్టులు మినహా మిగతా అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మీడియంలలో మాత్రమే ఉంటుంది.

About Kadam

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *