మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు.. ఎందుకంటే…

ఎంపీగా ప్రమాణం చేసిన రోజు జై పాలస్తీనా అని నినాదాలు చేసినందుకు మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీలోని బరేలి కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీన హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. మరి ఆయన ఈ నోటీసులపై పై కోర్టుకు వెళ్తారా..? విచారణకు హాజరవుతారా..? డీటేల్స్ తెలుసుకుందాం…

మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేసినందుకు ఒవైసీ న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని బరేలి కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. జనవరి ఏడవ తేదీన తమ ముందు హాజరుకావాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. బరేలి జిల్లా కోర్టు నుంచి ఒవైసీకి నోటీసులు అందడం సంచలనం రేపుతోంది. ప్రమాణ స్వీకారం తరువాత ఒవైసీ జై భీమ్‌ , జై తెలంగాణ , జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. చాలా రోజుల నుంచి మజ్లిస్‌ అధినేతపై ఈ వివాదం నడుస్తోంది. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలతో పాటు బీజేపీ నేతలు ఒవైసీని తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలను పూర్తిగా సమర్ధించుకున్నారు ఒవైసీ.. తన వ్యాఖ్యలు రాజ్యాంగం విరుద్దం కాదని అంటున్నారు.

అయితే ఓవైసీ వ్యాఖ్యలపై బరేలికి చెందిన వీరేంద్ర గుప్తా అనే వ్యక్తి ఒవైసీకి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఒవైసీపై బరేలి జిల్లా కోర్టు గత జులైలో వీరేంద్ర గుప్తా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే పలువురు బీజేపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం తరువాత జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారని అన్నారు ఒవైసీ.. భారత్‌ ప్రజాస్వామ్య , సెక్యులర్‌ దేశమని అన్నారు. జనవరి 7వ తేదీనే బరేలి జిల్లా కోర్టులో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ హాజరుకావాల్సి ఉంది. కులగణనపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రజలను విభజించే తీరుగా ఉన్నాయని వీరేంద్రగుప్తా పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో రాహుల్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.

About Kadam

Check Also

కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *