సాగు చేస్తున్న పొలంలోనే ఉరి వేసుకున్న రైతు కుటుంబం.. కన్నీరు పెట్టిస్తున్న నలుగురి మృతి!

అప్పుల భారం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. కడప జిల్లా సింహాద్రిపురం మండలంలో జరిగిందీ విషాదం. 15 ఎకరాలు కౌలుకు తీసుకున్న రైతు, 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేశాడు. అయితే అప్పుల బాధ తాళలేక పొలం దగ్గరే ఉరివేసుకుని రైతు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైతన్న కంట కన్నీరు ఆగడం లేదు.. ఎక్కడో ఒకచోట ఏదో ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంటూనే ఉంటుంది. వేసిన పంటకు గిట్టుబాటు లేక, చేసిన కష్టం తీరక, అప్పుల బాధతో అశువులు బాస్తున్నారు. అలాంటి సంఘటన ఇప్పుడు కడప జిల్లాలో జరిగింది. ఓ రైతు కుటుంబం తాను సాగు చేస్తున్న పొలంలోనే ఉరి వేసుకుని ప్రాణాలను విడిచింది. ఈ హృదయ విధారకమైన సంఘటన ఆ గ్రామంలో విషాదఛాయలను నింపింది.

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.. మృతుడు నాగేంద్ర ఆయన భార్య వాణి, పిల్లలు గాయత్రి, భార్గవ్ నలుగురు పొలంలో ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయారు. వారు సాగు చేస్తున్న పొలంలోనే ఉరి వేసుకొని చనిపోవడంతో ఆ గ్రామం అంతా వారి మృతితో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం రైతు నాగేంద్ర కొర్ర పంటను సాగు చేస్తున్నారు. అంతేకాక మరో ఒకటిన్నర ఎకరా భూమిలో చీని పంటను సాగు చేస్తున్నాడు. వాటితో పాటు మరో 15 ఎకరాలను కౌలుకు తీసుకుని 8 ఏళ్లుగా వివిధ రకాల పంటలను సాగు చేస్తూ, తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

అయితే ఎన్ని చేసినా దిగుబడి వస్తే రేటు లేకపోవడం రేటు ఉన్నప్పుడు దిగుబడి లేకపోవడంతో, ప్రతిసారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది ఆ రైతుకు. అంతే ఇన్నేళ్లు చేసిన కష్టం ఫలితం ఇవ్వకపోవడంతో చేసేదేమీలేక ప్రాణాలు విడిచాడు. పంట కోసం చేసిన అప్పులు ఎక్కువ అవడంతో కుటుంబంతో సహా తన సాగు చేస్తున్న పొలంలోనే ఉరి వేసుకుని చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఏది ఏమైనా రైతు కష్టం తీరనిది.. ప్రతి ఒక్క రైతు ఎంతో కష్టపడి పంటను పండిస్తాడు. కానీ దిగుబడి వచ్చే సమయానికి రేటు లేకపోవడం, రేటు ఉన్న సమయంలో దిగుబడి లేకపోవడంతో రైతు కంట కన్నీరు మాత్రం ఆగడం లేదు..!

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *