ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. ఏపీ సర్కారు అధికారిక ఉత్తర్వులు

ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్ (AP Govt New Chief Secretary K Vijayanand) పేరు అధికారికంగా ఖరారయ్యింది. ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆయన. విజయానంద్, సాయి ప్రసాద్‌ల మధ్య సీఎస్ పదవికి కోసం గట్టి పోటీ నెలకొంది. అయితే చివరకు ప్రభుత్వం విజయానంద్ వైపే మొగ్గుచూపింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీగా కె. విజయానంద్‌ నియమితులయ్యారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2025 నవంబర్ వరకు విజయానంద్‌కు సర్వీస్ ఉంది.

ప్రస్తుతం రాష్ట్ర సీఎస్‌గా ఉన్న 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల 31కి పదవీ విరమణ చేయనున్నారు. సీనియారిటీ ప్రకారం 1988 బ్యాచ్‌కి చెందిన శ్రీలక్ష్మి, 1990 బ్యాచ్ కు చెందిన అనంత రాము, 1991 బ్యాచ్ కు చెందిన జీ సాయి ప్రసాద్, అజయ్ జైన్, సుమితా దవ్రా, ఆర్.పి. సిసోడియాలు, 1992 బ్యాచ్‌కి చెందిన విజయానంద్ తదితరులు రేసులో నిలిచారు.  సీఎస్ ఎంపికలో కె. విజయానంద్, సాయి ప్రసాద్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు ప్రభుత్వం కె. విజయనాంద్ వైపే మొగ్గుచూపింది.

సాయి ప్రసాద్ కు 2026 మే వరకు పదవీ కాలం ఉండడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని తర్వాతైనా పరిశీలించవచ్చన్న ఏపీ ప్రభుత్వం ఆలోచించినట్లు తెలుస్తోంది. దీంతో విజయానంద్ వైపే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొగ్గుచూపారు. ఆ మేరకు రాష్ట్ర కొత్త సీఎస్‌గా విజయానంద్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

About Kadam

Check Also

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *