ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని 9, 10 తరగతుల హిందీ సిలబస్ మారనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 9, 10 తరగతుల హిందీ సిలబస్ ను మార్చి గతంలో రద్దు చేసిన రాష్ట్ర సిలబస్‌ని తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తుంది. ప్రస్తుతం ఈ తరగతుల్లో NCERT సిలబస్ అమలు చేస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు తరగతుల సిలబస్‌లో పాఠశాల విద్యాశాఖ మార్పులు తీసుకొస్తోంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) మినహాయించిన పాఠ్యాంశాలను తొలగించి, కొత్త పుస్తకాలు ముద్రించనుంది. తొమ్మిది, పది తరగతుల్లో ప్రస్తుతం ఉన్న ఎన్‌సీఈఆర్టీ హిందీ సిలబస్‌ను తొలగించనుంది. దీని స్థానంలో గతంలో రాష్ట్ర సిలబస్‌లోని హిందీ పుస్తకాలను తిరిగి ప్రవేశపెట్టనుంది. హిందీ సబ్జెక్టు సిలబస్ ఎక్కువగా ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక ప్రస్తుతం 6,7,8 తరగతుల్లో హిందీ సబ్జెక్టులో రాష్ట్ర సిలబస్‌నే అమలు చేస్తోంది. దీనిలో ఎలాంటి మార్పు ఉండబోదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
