ప్రధాని మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌.. విశాఖ టూర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా రోడ్‌షో

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు విశాఖ ముస్తాబైంది. కనీవినీ ఎరుగని రీతిలో మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మోదీ విశాఖ టూర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవబోతోంది రోడ్‌షో. దేశం దృష్టిని ఆకర్షించేలా భారీ రోడ్‌షో ఉండబోతోంది. ఇక, మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు విశాఖ భారీగా ముస్తాబైంది. కనీవినీ ఎరుగని రీతిలో మోదీకి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెబుతూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మోదీ విశాఖ టూర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవబోతోంది రోడ్‌షో. దేశం దృష్టిని ఆకర్షించేలా భారీ రోడ్‌షో నిర్వహించారు. ఇక, మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖ చేరుకున్న ప్రధాని మోదీకి, గవర్నర్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని రోడ్‌షోకి, బహిరంగసభకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. జనం భారీ ఎత్తున తరలివచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన కొనసాగుతోంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఒకే వాహనంపై సిరిపురం కూడలి నుంచి బహిరంగ సభా వేదిక అయిన ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం వరకు రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోలో అడుగడుగునా పూలు చల్లుతూ ప్రజలు ఘనస్వాగతం పలికారు. మోదీ, చంద్రబాబు, పవన్‌ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

అంతకుముందు విశాఖ టూర్‌లో NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు‌ శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. లక్షా 85 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు నిర్మాణం కాబోతోంది. ఈ ప్రాజెక్టుతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.


About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *