వెరీవెరీ బ్యాడ్‌న్యూస్.. తెలంగాణ మందుబాబులకు ఎంత కష్టమొచ్చిందో కదా

సంక్రాంతి పండుగ ముందే తెలంగాణ మందుబాబులకు భారీ షాక్ తగిలింది. ఆ బ్రాండ్ బీర్లు ఇకపై కనిపించవట. రాష్ట్రంలోనే ప్రసిద్ది గాంచిన ఈ బ్రాండ్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతకీ ఏ బ్రాండ్ బీర్లు ఆగిపోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

తెలంగాణలో బీర్ల సరఫరాపై కొత్త మలుపు తిరిగింది. కింగ్‌ఫిషర్ బీర్‌ను తయారు చేసే యునైటెడ్ బ్రూవరీస్, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్)కు సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ లేఖను SEBIకి రాసింది. యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటన ప్రకారం, టీజీబీసీఎల్ 2019 నుంచి ధరలను సవరించకపోవడం వల్ల కంపెనీకి భారీ నష్టాలు వచ్చాయి. గత ఐదేళ్లుగా ధరల పెంపు చేయని కారణంగా కంపెనీ ఆదాయంలో గణనీయంగా తగ్గుదల నమోదైందని పేర్కొంది. అంతేకాకుండా, టీజీబీసీఎల్ గత సరఫరాలకు సంబంధించిన బకాయిలను కూడా చెల్లించలేదని యునైటెడ్ బ్రూవరీస్ ఆరోపించింది. ఈ overdue బకాయిలు పరిష్కరించకుండా కొనసాగడం వల్లే సరఫరా నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

తెలంగాణలో బీర్ల విక్రయాలపై ప్రభావం

ఈ నిర్ణయం తెలంగాణలో బీర్ల సరఫరాపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముంది. కింగ్‌ఫిషర్ బీర్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. సరఫరా నిలిపివేతతో మార్కెట్‌లో గోధుమల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉండొచ్చు. ఇక యునైటెడ్ బ్రూవరీస్ నిర్ణయం నేపథ్యంలో టీజీబీసీఎల్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. బకాయిల చెల్లింపులు, ధరల సవరణల అంశాలపై నిర్ణయం తీసుకోకపోతే సమస్య మరింత ఉధృతం కావచ్చునని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

About Kadam

Check Also

నో హెల్మెట్, నో ఇన్స్యూరెన్స్.. నో పెట్రోల్.. త్వరలోనే హైదరాబాద్ లో

నో హెల్మెట్..నో ఇన్సూరెన్స్… నో పెట్రోల్, డీజిల్..! కొత్త నిబంధనలు కేంద్ర కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తుంది. వాహనాలపై కేంద్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *