తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తోపులాటలో ఆరుగురు మృతి చెందారు. రుయా, స్విమ్స్‌లో మరో 48 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల జారీ ప్రక్రియ నేపథ్యంలో ఈ దుర్ఘటన జరిగింది.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతులకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇప్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.
తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. గాయపడ్డవారిని రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.