ఫార్ములా-E రేస్‌ కేసు విచారణలో ఉత్కంఠ.. BLN రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టిన ఏసీబీ

ఫార్ములా ఈ రేస్ కేసులో ఎంక్వైరీ టాప్ గేర్‌లో నడుస్తోంది. ఓ వైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ వేగం పెంచాయి. కేసులో నిందుతులుగా ఉన్న అధికారులను వరుసగా విచారిస్తోంది. బీఎల్‌ఎన్ రెడ్డిపైనా ప్రశ్నల వర్షం కురిపించింది. మొన్న ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. ఇవాళ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఏసీబీ విచారించింది.

మొన్న ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌, నిన్న కేటీఆర్‌.. ఇవాళ బీఎల్‌ఎన్‌ రెడ్డి. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఏసీబీ ఇన్వెస్టిగేషన్‌ స్పీడందుకుంది. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో ఇంటరాగేషన్‌.. ఇంటర్‌ లింక్స్‌తో సాగుతోంది. A2గా ఉన్న ఐఏఎస్‌ అధికారి అరవింద్‌కుమార్‌ని మొన్న విచారించిన ఏసీబీ… ఆయన స్టేట్‌మెంట్‌ ఆధారంగా A1గా ఉన్న బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను నిన్న ప్రశ్నించింది ఏసీబీ. రెండు సెషన్లు… సుమారు 7 గంటలపాటు కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు..? ఎంత మొత్తంలో నిధులను ట్రాన్సఫర్ చేశారు..? లిఖితపూర్వక ఆదేశాలు ఏమైనా ఇచ్చారా..? అంటూ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్‌ కూడా రికార్డ్‌ చేశారు.

ఇక ఇప్పుడు A1, A2 స్టేట్‌మెంట్‌ ఆధారంగా.. A3 బీఎల్‌ఎన్‌ రెడ్డిని విచారించారు ఏసీబీ అధికారులు. నిధులు చెల్లింపు కోసం అనుమతి ఎందుకు తీసుకోలేదు..? విదేశాలకు నిధులు చెల్లించాలంటే RBI అనుమతి తీసుకోవాలన్న కనీస విషయం తెలియదా…? ఎవరు ఆదేశిస్తే ప్రొసీడింగ్స్‌ పూర్తి చేశారు…? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మొత్తంగా ఈ ఇంటర్‌ లింక్ ఎంక్వైరీతో అధికారులు ఏం తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

About Kadam

Check Also

రతన్ టాటా రూ.15 వేల కోట్లు ఎవరికి వస్తాయి? వీలునామాలో ఎవరి పేర్లు ఉన్నాయి?

రతన్‌టాటా ప్రస్తుతం మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *