ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణంలో ఎస్టీపి ప్లాంట్..హెలిప్యాడ్ సదుపాయం కూడా..

ఎన్నో రోజుల వైద్యుల కళ నెరవేరబోతుంది.రేపు సీఎం చేతులమీదుగా కొత్త ఉస్మానియా జనరల్ ఆసుపత్రి శంకుస్థాపన జరగనుంది.అత్యాధునిక వైద్య,నిర్మాణ సదుపాయాలతో ఆసుపత్రి నిర్మాణం కాబోతుంది.గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.

హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాల్లో దాదాపు 2వేల కోట్ల అంచనా వ్యయం తో ఈ కొత్త ఆస్పత్రి నిర్మాణం జరగనుంది.30 డిపార్ట్ మెంట్ లు,2వేల పడకలు,ఫిజియోథెరపీ ,డెంటల్, కాలేజ్ లు,హాస్టల్ వసతి తో ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం ఎలా ఉండబోతుంది?వసతులు ఎంటి ? చూద్దాం.

అడ్డంకులు దాటుకొని శంకుస్థాపన కు సిద్దం అయింది ఉస్మానియా జనరల్ ఆసుపత్రి. రానున్న టెక్నాలజీ కాలానికి అనుగుణంగా హెలిప్యాడ్ వసతి,ఆసుపత్రి మురుగు నీరు శుద్ధి చేసేందుకు stp ప్లాంట్, విశాలమైన పార్కింగ్ ఫెసిలిటీ తో కొత్త ఆస్పత్రి అందుబాటులోకి రానుంది.రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.ప్రతి డిపార్ట్‌మెంట్ కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌తో కూడిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూ వార్డులు అందుబాటులో ఉంటాయన్నారు. కిడ్నీ, లివర్‌‌, స్కిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం కొత్త ఉస్మానియాలో అందుబాటులోకి రానున్నాయి.

పేషెంట్ల సౌకర్యార్థం అన్ని రకాల డయాగ్నసిస్ సేవలను ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌‌లో ఓపీ సేవలు అందించాలని… పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్,కనీసం రోజూ 3 వేల నుంచి 5 వేల మంది పేషెంట్లు వచ్చే అవకాశం ఉన్నందున, ఇందుకు అనుగుణంగా ఓపీ కౌంటర్ల నిర్మాణం జరగనుంది.ఓపీ కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడే ప్రసక్తే ఉండకుండా నిర్మాణం. కొత్త ఉస్మానియాలో నర్సింగ్, డెంటల్, ఫిజియో థెరపీ కాలేజీలు అందుబాటులోకి..స్టూడెంట్ల కోసం హాస్పిటల్ ఆవరణలోనే హాస్టల్స్‌ను నిర్మనం. 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం అందుబాటులోకి రానుంది.

About Kadam

Check Also

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు!

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *