ఏపీ వ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు కిటకిట.. ఒక్క రోజులో 100 కోట్లుగా పైగా రెవిన్యూ

ఏపీ వ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు కిటకిటలాడుతున్నాయి.  గురువారం నుంచి ఆఫీసుల్లో రష్ కొనసాగుతుంది.  గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 14250 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్కరోజులో ప్రభుత్వానికి 107కోట్ల ఆదాయం వచ్చింది.  గురువారం అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1184 రిజిస్ట్రేషన్లు జరిగాయి.  ఎన్టీఆర్‌ జిల్లాలో 946, పల్నాడులో 944, విశాఖలో 658 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అయితే అల్లూరి అల్లూరి జిల్లాలో మాత్రం ఎలాంటి రిజిస్ట్రేషన్లు అవ్వాయి.

ఇక శనివారం నుంచే ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అలాగే భూముల మార్కెట్ ధరలు కూడా పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే నిత్యం 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లోనూ.. గత మూడ్రోజుల నుంచి 150 నుంచి 170 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ రేంజ్‌ తాకిడికి పలు చోట్ల సర్వర్లూ మొరాయిస్తున్నాయి. ఇటు గుంటూరు జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రాష్ట్రంలో ఎక్కడాలేని రద్దీ కనిపిస్తోంది.

గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు. ఛార్జీల పెంపు సాధారణంగా 15 నుంచి 20 శాతం మధ్య ఉంటుంది. రెవెన్యూ ఆదాయం పెంపు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను క్రమబద్ధీకరిస్తున్నారు.. కొన్ని చోట్ల ధరలు తగ్గితే.. మరికొన్ని చోట్ల పెరగనున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు శాస్త్రీయ పద్ధతిలో చేయలేదని, దీని కారణంగా చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

About Kadam

Check Also

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *