ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాలు.. భారత్‌ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Corrupt Country: అత్యంత అవినీతి దేశాల జాబితాను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని 180 దేశాలు పాల్గొన్నాయి. ఈ ఏడాది విడుదలైన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ఏ దేశం ఉంది. మన భారతదేశం ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా అవినీతి జరిగే దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ, తక్కువ అవినీతి జరిగే దేశాలు ఉన్నాయి. 2024 సంవత్సరానికి Corruption Perceptions Index (CPI) ప్రకారం.. డెన్మార్క్ ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి దేశంగా నిలిచింది. తరువాత ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక భారతదేశాన్ని 96వ స్థానంలో నిలిపింది. గత సంవత్సరం ర్యాంక్ కంటే మూడు స్థానాలు వెనుకబడి ఉంది.

నిపుణులు, వ్యాపారవేత్తల ప్రకారం.. ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిలను బట్టి ఈ సూచిక 180 దేశాలు, భూభాగాలను ర్యాంక్ చేస్తుంది. జీరో నుండి 100 వరకు స్కేల్‌ను ఉపయోగిస్తుంది. ఇక్కడ “జీరో” అనేది అత్యంత అవినీతి, “100” ఉంటే ఎలాంటి అవినీతి లేదని అర్థం. 2024 నివేదిక ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో అవినీతి ప్రమాదకరమైన సమస్య అని హైలైట్ చేసింది. కానీ చాలా దేశాలలో మంచి కోసం మార్పు జరుగుతోంది.

భారత్‌ ఏ స్థానం అంటే..

కరెప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్‌లో ఇండియా కేవలం 39 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో అవినీతి అవగాహన సూచికలో భారత్ 93వ స్థానంలో నిలిచింది. ఇంతకు ముందుకూడా భారత్‌ ఇదే స్థానాల్లో ఉంది. 2022కి, 2023కి ఇండియాలో అవినీతిలో పెద్దగా ఏమీ మారలేదని నివేదిక చెబుతోంది. 2023లో భారతదేశం ర్యాంక్ 93గా ఉంది. భారతదేశ పొరుగు దేశాలలో, పాకిస్తాన్ (135), శ్రీలంక (121) వాటి తక్కువ ర్యాంకింగ్‌లతో ఇబ్బంది పడుతుండగా, బంగ్లాదేశ్ 149 వద్ద మరింత వెనుకబడి ఉంది. ఈ ర్యాంకింగ్‌లో చైనా 76వ స్థానంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాల నుంచి రష్యా, వెనిజులా వంటి నిరంకుశ దేశాల వరకు అనేక దేశాలు దశాబ్దానికి పైగా అత్యంత దారుణమైన ర్యాంకింగ్‌ను ఎదుర్కొన్నాయి.

అమెరికా 69 పాయింట్ల నుండి 65కి పడిపోయి, గతంలో 24వ స్థానంలో నుంచి 28వ స్థానానికి చేరుకుంది. ఇతర పాశ్చాత్య దేశాలలో ఫ్రాన్స్ నాలుగు పాయింట్లు దిగజారి 67కి చేరుకోగా, జర్మనీ మూడు పాయింట్లు దిగజారి 75కి, మూడు స్థానాలు దిగజారిన కెనడాతో సమానంగా ఉంది.

దేశ స్కోర్‌లను ఎలా లెక్కిస్తారు?

అవినీతి అంటే లంచం ఇవ్వడమే కాదు. ఈ సూచికను రూపొందించేటప్పుడు చాలా విషయాలు అవినీతిలో భాగంగా పరిగణిస్తారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ కార్యాలయాల వ్యక్తిగత వినియోగం, ప్రభుత్వ రంగంలో పెరుగుతున్న అవినీతి, ప్రభుత్వ రంగంలో అవినీతిని ప్రోత్సహించే నిబంధనలను అమలు చేయడం, సివిల్ సర్వీస్‌లో బంధువుల నియామకం, అవినీతి కేసుల నమోదు, అలాగే సంబంధిత వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఇలా ఎన్నో రకాల విషయాలను పరిగణలోకి తీసుకుని జాబితాను తయారు చేసి విడుదల చేస్తారు.

About Kadam

Check Also

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *