టమాటా రైతులకు పండుగలాంటి వార్త.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

టమాటా ధరల పతనంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్రీ అవుతోంది. రైతులు పూర్తి స్థాయిలో నష్టపోకుండా చర్యలు ప్రారంభించింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో టమాటా ధరల పతనంపై ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది.

టమాటా ధరల పతనంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్రీ అవుతోంది. రైతులు పూర్తి స్థాయిలో నష్టపోకుండా చర్యలు ప్రారంభించింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో టమాటా ధరల పతనంపై ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో టమాటాను రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మంత్రి అచ్చెన్నాయుడు మార్కెటింగ్ డైరెక్టర్‌ విజయ సునీత, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం

టమాటా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మార్కెటింగ్ శాఖ.. ఫిబ్రవరి 21 నుంచి రైతుల దగ్గర టమాటలను కొనుగోలు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో నేరుగా విక్రయించాలని, పొరుగు రాష్ట్రాలకు అవసరం మేరకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంలో పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే రవాణా సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల మార్కెటింగ్ అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లు, రైతు బజార్ల అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగు దశ నుంచి మార్కెటింగ్ దశ వరకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. టమాటా కొనుగోళ్లకు అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించాలని, పరిస్థితి తనకు నేరుగా ఎప్పటికప్పుడు తెలియచేయాలని మంత్రి ఆదేశించారు.

About Kadam

Check Also

ఉదయగిరిలో దారుణ హత్య.. పట్టపగలు అందరూ చూస్తుండగానే నరికి చంపారు!

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని అల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వద్ద మహమ్మద్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *