కడప జైల్ మెడికల్ క్యాంపు వెనకాల… ఏం జరిగిందో తెలిస్తే..

రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ శ్రీరామ్‌ను విచారణ అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా, డాక్టర్‌ చైతన్యరెడ్డి, అప్పటి కడప సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఐఎన్‌ఎస్‌ ప్రకాష్‌, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై కేసులు నమోదు చేశారు. విచారణలో, డాక్టర్‌ చైతన్యరెడ్డి జైలులో దస్తగిరి బ్యారక్‌లోకి ప్రవేశించి, ఆయనను బెదిరించారనే ఆరోపణలపై దృష్టి పెట్టారు.

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి, కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సమయంలో బెదిరింపులకు గురైనట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 2023 నవంబర్‌ 28న, డాక్టర్‌ దేవిరెడ్డి చైతన్యరెడ్డి జైలులో మెడికల్‌ క్యాంప్‌ నిర్వహణ పేరుతో ప్రవేశించి, దస్తగిరి బ్యారక్‌లోకి వెళ్లి ఆయనను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చైతన్యరెడ్డి, వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు. దస్తగిరి ఫిర్యాదు మేరకు, చైతన్యరెడ్డి తనను నిందితులకు అనుకూలంగా సాక్ష్యం ఇవ్వాలని, లేదంటే ప్రాణహానికి గురిచేస్తామని బెదిరించారన్నది ఆరోపణ. అయితే ఆ ఆరోపణలపై అప్పటి జైల్ సూపెరెండెంట్ ప్రకాష్ పై ప్రభుత్వం తాజాగా అభియోగాలు మోపుతూ సమాధానాలు చెప్పాలని ఉత్తర్వులు జారీ చేసింది

దస్తగిరి ఫిర్యాదు తో వెలుగులోకి..

ఈ ఘటనపై దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం, ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ శ్రీరామ్‌ను విచారణ అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా, డాక్టర్‌ చైతన్యరెడ్డి, అప్పటి కడప సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఐఎన్‌ఎస్‌ ప్రకాష్‌, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై కేసులు నమోదు చేశారు. విచారణలో, డాక్టర్‌ చైతన్యరెడ్డి జైలులో దస్తగిరి బ్యారక్‌లోకి ప్రవేశించి, ఆయనను బెదిరించారనే ఆరోపణలపై దృష్టి పెట్టారు. టీడీపీ నేత బీటెక్‌ రవి, దస్తగిరి బ్యారక్‌కు ఎదురెదురు బ్యారక్‌లో ఉన్నారని, చైతన్యరెడ్డి దస్తగిరి బ్యారక్‌లోకి వెళ్లడం చూశానని తెలిపారు.

ప్రకాష్ పై అభియోగాలు..

అప్పటి కడప సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఐఎన్‌ఎస్‌ ప్రకాష్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయి. దస్తగిరి ఫిర్యాదు ప్రకారం, జైల్లో ఉన్న సమయంలో ప్రకాష్‌ తనను వేధించారని, చైతన్యరెడ్డికి జైలులో ప్రవేశం కల్పించారని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, ప్రభుత్వం అప్పట్లో ప్రకాష్‌ను నెల్లూరుకు బదిలీ చేసింది.

తాజాగా ప్రకాశ్ నిబంధనల ఉల్లంఘన, దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ జైళ్ళ శాఖ జారీ చేసిన ఉత్తర్వులు సంచలనం కలిగిస్తున్నాయి. కడప రిమ్స్, జీజీహెచ్ లలో నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నా మెడికల్ క్యాంప్ పేరిట చైతన్యరెడ్డి కి జైల్లోకి ప్రవేశం కల్పించారు అని, దురుద్దేశపూరితంగా వీలు కల్పించి, కారాగార పరిపాలన నిబంధనలు, పద్ధతుల్ని ప్రకాష్ ఉల్లంఘించారని పేర్కొంది ప్రభుత్వం. 10 రోజుల్లో లిఖిత పూర్వకంగా లేకుంటే నేరుగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. లేదంటే నేరుగా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసారు హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్. ఈ సమయంలో రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం నెల్లూరులోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రీఫార్మేషన్ సర్వీసెస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు ప్రకాష్.

ప్రస్తుతం, ఈ కేసు విచారణ కొనసాగుతోంది. దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై సత్వర నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

About Kadam

Check Also

పెళ్ళికొడుకు అలంకారం లో ముస్తాబైన పరమశివుడు… మహాశివరాత్రికి మూడు రోజుల ముందే కళ్యాణ మహోత్సవం…

23 వ తేదీ ఆదివారం మాఘ బహుళ దశమి ముహూర్తాన ఉదయం 11 గంటలకు శ్రీ భవాని సహిత సిద్దేశ్వరస్వామి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *