ఇక విద్యార్థుల సెల్‌ఫోన్లకే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. మంత్రి లోకేశ్‌ వెల్లడి

మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానిస్తున్నట్లు మంత్రి లోకేష్‌ శాసనసభలో తెలిపారు. ఈ ఏఐ ఆధారిత మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను జూన్‌ 30 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని, దీని ద్వారా వాయిస్‌ సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. దీనిద్వారా టెన్త్, ఇంటర్‌ విద్యార్థులు ఇంటి నుంచే ..

ఏఐ ఆధారిత మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను జూన్‌ 30 నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని, దీని ద్వారా వాయిస్‌ సేవలు అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. టెన్త్, ఇంటర్‌ విద్యార్థులు ఇంటి నుంచే మొబైల్‌ ద్వారా హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చిన కూటమి సర్కార్.. పబ్లిక్‌ పరీక్షా ఫలితాలు వెలువడిన వెంటనే.. వాటి ఫలితాలను కూడా వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా విద్యార్థుల మొబైల్‌ నంబర్లకు నేరుగా పంపిస్తామని చెప్పారు. అలాగే ఏఐ ఆధారిత వాయిస్‌ సేవలతో.. బస్‌ టికెట్‌ కావాలని నోటితో చెబితే టికెట్‌ బుక్‌ చేస్తుందని, నంబర్‌ చెబితే కరంటు బిల్లు కట్టేస్తుందని వెల్లడించారు. ఈ సేవలు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు.

ఈ మేరకు శాసనసభలో ‘వాట్సప్‌ గవర్నెన్స్‌’పై జరిగిన చర్చత్తో మంత్రి తోకేష్‌ సమాధానమిచ్చారు. రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల సేవలు కూడా వాట్సప్‌ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు. సర్టిఫికెట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటయ్యేలా త్వరలో చట్టసవరణ చేస్తామని మంత్రి లోకేశ్‌ చెప్పారు.

ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పరీక్ష ప్రాథమిక కీ విడుదల.. మార్చి 23 వరకు అభ్యంతరాలకు అవకాశం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఏపీపీఎస్సీ) ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ప్రాథమిక కీ తాజాగా విడుదల చేసింది. కీపై అభ్యరంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా మార్చి 21 నుంచి 23వ తేదీ వరకు స్వీకరించనున్నారు. మార్చి 16న ఈ పరీక్ష నిర్వహించగా..7,620 మంది పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టారు.

తెలంగాణ విదేశీ విద్య దరఖాస్తులు ప్రారంభం

విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద 2025-26 విద్యా సంవత్సరానికి గానూ అర్హులైన ఎస్సీ విద్యార్థులు మార్చి 20 నుంచి మే 19 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ తెలిపింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఈ-పాస్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని, చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *