ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన రాచకొండ సీపీ.. ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025లో ఉత్కంఠ మ్యాచ్‌లు సాగుతున్నాయి. ప్రస్తుతం లీగ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ చేరే జట్లపైనా ఓ క్లారిటీ వచ్చేసింది. 34 మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి ఢిల్లీ జట్టు అగ్రస్థానంలో నిలవగా, పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఈ క్రమంలో ఓ వార్తతో ఐపీఎల్ ఫ్రాంచైజీలతోపాటు బీసీసీఐలో కలకలం రేపింది. హైదరాబాద్ కేంద్రంగా ఓ బిజినెస్ మెన్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. తాజాగా దీనిపై రాచకొండ సీపీ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌కు చెందిన ఓ పంటర్‌.. ఐపీఎల్‌ క్రికెటర్లను ఫిక్సింగ్‌లోకి లాగుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఫిక్సింగ్‌ కోసం ఓ బిజినెస్‌మెన్‌ ఖరీదైన గిఫ్ట్‌లు, జ్యుయలరీ ఆఫర్‌ చేస్తున్నాడని ఐపీఎల్ టీమ్‌లు బస చేసే హోటళ్లకు వెళ్లి అక్కడ లాబీయింగ్‌కు ప్రయత్నిస్తున్నాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన హైదరాబాద్‌ పోలీసులు.. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.

ఫిక్సింగ్‌కు హైదరాబాద్‌ వ్యాపారవేత్త ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన కథనాలు అవాస్తవమంటూ రాచకొండ సీపీ సుధీర్ బాబు తేల్చేశారు. కాగా, బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం, అలెర్ట్ రాలేదని ఆయన అన్నారు. క్రిక్‌బజ్‌ రాసిన కథనం పూర్తిగా అవాస్తవం, ఉప్పల్ స్టేడియంకు గాని ఆటగాళ్లు బస చేసిన హోటల్‌కు గానీ, అనుమానితులు ఎవ్వరూ వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఆలాంటి ప్రలోభాలకు ఎవరు పాల్పడలేదని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లు ఫిక్సింగ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *