వాయిదా వేసిన సీఏ పరీక్షల కొత్త తేదీలు వచ్చేశాయ్‌.. మే 16 నుంచి పునఃప్రారంభం

దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. తాజాగా దేశంలో భద్రతా పరిస్థితులకు సంబంధించి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో..

ఇండియా- పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల రీత్యా సీఏ పరీక్షలను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) 2025 వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల మే 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఈ పరీక్షలు మే 9 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. తాజాగా దేశంలో భద్రతా పరిస్థితులకు సంబంధించి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ICAI తెలిపింది. దీంతో సీఐ ఫైనల్, ఇంటర్మీడియట్, ఐఎన్‌టీటీ-ఏటీ (పీక్యూసీ) పరీక్షలను మే 16 నుంచి 24 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఐసీఏఐ తన ప్రకటనలో తెలిపింది.

కొత్త షెడ్యూల్ ఇదే..

  • మే 10 (శనివారం)న జరగాల్సిన తుది పరీక్ష (గ్రూప్ II) పేపర్ – 5 మే 16 (శుక్రవారం)కి మార్చారు.
  • మే 13 (మంగళవారం) జరగాల్సిన ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్స్, ఇంటర్నేషనల్ టాక్సేషన్ – అసెస్‌మెంట్ టెస్ట్ (INTT–AT) పేపర్ – 2, ఇంటర్నేషనల్ టాక్స్ – ప్రాక్టీస్‌లను కవర్ చేసే ఫైనల్ ఎగ్జామినేషన్ (గ్రూప్ II) పేపర్ – 6లు పరీక్ష మే 18 (ఆదివారం)న నిర్వహించబడుతుంది.
  • మే 9 (శుక్రవారం)న జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు (గ్రూప్ II), పేపర్ – 4, కాస్ట్ & మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ పరీక్ష మే 20 (మంగళవారం)కి మార్చారు.
  • మే 11 (ఆదివారం)న జరగాల్సిన పేపర్ – 5, ఆడిటింగ్ & ఎథిక్స్ పరీక్ష మే 22 (గురువారం)న జరుగుతుంది.
  • మే 14వ తేదీ (బుధవారం) జరగాల్సిన పేపర్ – 6, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ & స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ పరీక్ష మే 24వ తేదీ (శనివారం)కి మార్చారు.

రీషెడ్యూల్ చేయబడిన పరీక్షలు అవే పరీక్షా కేంద్రాలలో, అదే సమయాలలో అంటే.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే జారీ చేయబడిన అడ్మిట్ కార్డులు రీషెడ్యూల్ చేయబడిన తేదీలకు చెల్లుబాటులో ఉంటాయి.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు మరికొన్ని గంటలే ఛాన్స్‌.. ఇదే చివరి అవకాశం!

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో చేరేందుకు ఇంటర్‌బోర్డు మరో అవకాశం కల్పించింది. రూ.1000 ఆలస్య రుసుముతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *