తెలంగాణ పాలిసెట్‌ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మే 13న పాలిసెట్‌ 2025 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 276 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్షకు హాజరైనట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాలిసెట్‌ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక పాలీసెట్‌ ఫలితాలు ఈ నెల 25న విడుదలకానున్నాయి. పరీక్షకు బాలురు 92.84%, బాలికలు 92.4% చొప్పున పరీక్షకు హాజరైనట్టు ఆయన వెల్లడించారు.

స్వయం-2025 అడ్మిట్‌ కార్డ్స్‌ విడుదల.. మే 17 నుంచి పరీక్షలు ప్రారంభం

స్వయం జనవరి సెమిస్టర్‌ 2025 పరీక్షల హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(NTA) వివిధ కోర్సుల్లో సర్టిఫికేషన్‌ కోసం నిర్వహించే స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ ఆస్పైరింగ్‌ మైండ్స్‌(SWAYAM-2025) జనవరి సెమిస్టర్‌ అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా స్వయమ్‌ పరీక్షలు మే 17, 18, 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జరగనుంది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *