విమాన ప్రమాదం, దర్యాప్తు పురోగతి వివరాలను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అందరినీ షాక్‌కి గురి చేసిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలో ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్ చేశారని తెలిపారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం 241 మంది ప్రాణాలను బలితీసుకుంది. అయితే.. ఈ విమాన ప్రమాదంపై విమానయాన శాఖ వివరణ ఇచ్చింది. విమాన ప్రమాదం, దర్యాప్తు పురోగతి వివరాలను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు వెల్లడించారు. ఎయిర్ సేఫ్టీపై ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం.. అహ్మదాబాద్ విమానప్రమాదంపై తొలి ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. విమాన ప్రమాదం అందరినీ షాక్‌కి గురి చేసిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలో ప్రమాదం జరిగిందన్నారు. 650 అడుగుల ఎత్తులో విమానంలో ఏదో సాంకేతిక లోపం ఏర్పడిందని.. ఎయిపోర్ట్‌కు 2 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని.. ప్రమాదానికి ముందు పైలట్ మేడే కాల్ చేశారని తెలిపారు. ఈ ప్రమాదం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. రెండు రోజుల నుంచి ఎంతో బాధలో ఉన్నానని తెలిపిన రామ్మోహన్‌నాయుడు.. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. విమాన ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని.. బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్ చేస్తున్నామని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయానని.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకూ తెలుసని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. AAIB డీజీ దర్యాప్తు ప్రారంభించారన్నారు. బ్లాక్ బాక్స్ డీకోడింగ్ చేస్తే వివరాలు తెలుస్తాయన్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేశామని..3 నెలల్లో కమిటీ నివేదిక ఇస్తుందని రామ్మోహన్‌నాయుడు తెలిపారు. బాధితులకు అండగా ఉండాలని ఎయిరిండియాకు సూచించామన్నారు. బోయింగ్ 787 భద్రతపై కూడా దర్యాప్తునకు ఆదేశించామన్నారు. 34 బోయింగ్ 787 విమానాలు ఉన్నాయని.. ఏడు విమానాల భద్రతపై సమీక్ష జరిగిందన్నారు. దర్యాప్తు వివరాలను త్వరలో వెల్లడిస్తామని రామ్మోహన్ తెలిపారు.
అంతకుముందు సివిల్ ఏవియేషన్ సెక్రటరీ మాట్లడారు. 12వ తేదీ మ.2 గంటలకు విమాన ప్రమాదం జరిగిందని..విమానంలో సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారన్నారు.. కూలిపోయే ముందు పైలట్ నుంచి మేడే కాల్ వచ్చిందని.. తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. ఎయిర్‌పోర్టుకు 2 కి.మీ. దూరంలో కూలిందని.. 3 గంటలపాటు ఎయిర్‌పోర్టును మూసివేశామన్నారు. సా.5 గంటలకు మళ్లీ సేవలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రమాదం అనంతరం హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామని.. ఘటనపై దర్యాప్తు కోసం ఉన్నతస్థాయి కమిటీ వేశామని.. బ్లాక్ బాక్స్‌పై అధ్యయనం జరుగుతోందని.. సివిల్ ఏవియేషన్ సెక్రటరీ పేర్కొన్నారు.