తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై సర్కార్ బడుల్లో ప్రీప్రైమరీ క్లాసేస్!

రాష్ట్రంలో పాఠశాల విద్య బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే స్కూల్ ఎడ్యూకేషన్‌లో అనేక మార్పులు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభంపై విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 210 స్కూల్స్ తో పాటు మరిన్ని స్కూల్స్ లో ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ప్రాథమిక విద్య అంటే సాధారణంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని అంటారు. కానీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ యూకేజీలోనే విద్యార్థులను ఫస్ట్ క్లాస్ లోకి వెల్లేందుకు తయారు చేయనున్నారు ఉపాద్యాయులు.

అయితే రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 210 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంబిస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఒక్కో స్కూల్లో 30 మంది విద్యార్థులను చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రైమరీ పాఠశాలల్లో ఐదేళ్లు నిండినవారిని ఒకటో తరగతిలో చేర్చుకుంటుండగా.. కొత్త ప్రీ ప్రైమరీ సెక్షన్ల ప్రకారం నాలుగేళ్లు నిండిన చిన్నారులను యూకేజీలోకి చేర్చుకోనుంది ప్రభుత్వం.

ఇక ప్రీ ప్రైమరీ విద్యార్థులకు పాఠాల బోధించేందుకు ఒక విద్యా వాలంటీర్ తోపాటు చిన్నారులకు అన్ని సౌకర్యాలు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా నియమించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి జిల్లాలో కనీసం 30 బడుల్లో ప్రీప్రైమరీ సెక్షన్ ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ, రాష్ట్రవ్యాప్తంగా 210 పాఠశాలల్లోనే ఏర్పాటుకే అనుమతి ఇచ్చింది. త్వరలో మరో 700-800 పాఠశాలలకు మంజూరవుతాయని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *