ఉగ్రదాడి తర్వాత.. కశ్మీర్‌లో తెరుచుకున్న పర్యాటక ప్రదేశాలు

ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి కాశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గతంలో మాదిరిగా ప్రస్తుతం పర్యాటకుల రావడంలేదని స్థానికులు చెబుతున్నారు.  ఈనెల 17 నుంచి మూసీవున్న ప్రాంతాలను తిరిగి పర్యాటకుల సందర్శనార్థం అనుమతిస్తే కొంత మేర పరిస్థితి మెరుగవుతుందని అక్కడి స్థానికులు, చిరు వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత అక్కడి పర్యాటక ప్రదేశాలన్నీ మూతపడ్డాయి. భద్రతా చర్యల కారణంగా మూసివేసిన పర్యాటక ప్రాంతాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మళ్లీ తెరిచింది. దాదాపు రెండు నెలల తర్వాత పహల్‌గామ్‌ పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ కనిపిస్తోంది. రహదారులపై వాహనాలు తిరుగుతున్నాయి. మార్గమధ్యంలో ప్రజలు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. పహల్గాంతో సహా చుట్టు పక్కల ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకుల రద్దీతో పలు చోట్ల వాహనాల రద్దీ ఏర్పడింది. పర్యాటక శాఖ పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసింది.

అయితే, జమ్మూ-కశ్మీర్‌లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎప్పుడూ పర్యాటకులతో రద్దీగా ఉండేది. అక్కడి స్థానికులు దాదాపు టూరిజం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి కాశ్మీర్ లోయలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గతంలో మాదిరిగా ప్రస్తుతం పర్యాటకుల రావడంలేదని స్థానికులు చెబుతున్నారు.  ఈనెల 17 నుంచి మూసీవున్న ప్రాంతాలను తిరిగి పర్యాటకుల సందర్శనార్థం అనుమతిస్తే కొంత మేర పరిస్థితి మెరుగవుతుందని అక్కడి స్థానికులు, చిరు వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

About Kadam

Check Also

CBSE బోర్డు కొత్త రూల్స్.. 10, 12 తరగతి పరీక్షలకు 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP) 2020కి జవాబుదారీతనం, క్రమశిక్షణ, సరైన అమలును నిర్ధారించడానికి CBSE బోర్డు తాజాగా కీలక మార్గదర్శకాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *