కీలక మలుపు తిరిగిన కాలేశ్వరం విచారణ..! మంత్రులతో సీఎం రేవంత్‌ మీటింగ్‌

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన మలుపు తిరిగింది. కమిషన్ ప్రభుత్వాన్ని సంప్రదించి, ప్రాజెక్టుకు సంబంధించిన మంత్రివర్గ సమావేశాల నిమిత్తాలను అందించాలని కోరింది. నీటిపారుదల శాఖకు కూడా లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని చర్చించి అధికారులకు అన్ని వివరాలు కమిషన్ కు అందించాలని ఆదేశించారు.

కాళేశ్వరం కమిషన్‌ విచారణ కీలక మలుపు తిరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన మంత్రివర్గ తీర్మానాల వివరాలు ఇవ్వాలని కాళేశ్వరం కమిషన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు హరీష్‌, ఈటలను కమిషన్ విచారించిన విషయం తెలిసిందే. కేబినెట్ ఆమోదంతో అన్ని నిర్ణయాలు తీసుకున్నామని కేసీఆర్‌, హరీష్‌రావు, ఈటల చెప్పడంతో కమిషన్‌ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆనాటి మంత్రివర్గ తీర్మానాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 13న నీటిపారుదలశాఖకు కూడా లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్‌ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిన్న మంత్రుల సమావేశంలో చర్చించారు. అంతేకాదు కమిషన్‌కు అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *