గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!

తెలంగాణకు కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమైంది ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఉన్న అనుకూలతలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభోత్సవానికి కావలసిన మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది జిల్లా అధికారుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు.

ముఖ్యంగా జులై 14 వ తేదీన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ఘనంగా ప్రారంభించి తరగతులు నిర్వహించేందుకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా రాష్ట్రానికి మంజూరైన ఏడు నవోదయ విద్యాలయాలు కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట లలో ప్రారంభం కానున్నాయి.

ఈ ఏడాది జూలై 15 నాటికి క్లాసులు ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యా శాఖ కార్యదర్శి యోగితా రానా ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ వంతులైన విద్యార్థులకు అయా నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వారిని స్వాగతించేందుకు, నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *