జియో వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. సరికొత్త స్టార్టర్ ప్యాక్‌.. ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ఈ ప్రయోజనాలను ఒకే ఆఫర్‌లో అందించడం ద్వారా కొత్త వినియోగదారులకు డిజిటల్ అనుభవాన్ని సులభతరం చేయడం జియో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆఫర్ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులను, బహుళ ప్లాట్‌ఫామ్‌లలో జియో అనుభవాన్ని అన్వేషించాలనుకునే వారికి విస్తృతంగా..

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు రిలయన్స్ జియో స్టార్టర్ ప్యాక్‌ను ప్రారంభించింది. కేవలం రూ.349తో కస్టమర్లు జియో స్టార్టర్ ప్యాక్‌ను పొందవచ్చు. కొత్త మొబైల్ పరికరాన్ని కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్యాక్ డిజిటల్ యుటిలిటీ, అనుభవాన్ని పెంచే లక్ష్యంతో శక్తివంతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

జియో స్టార్టర్ ప్యాక్ వల్ల లభించే ప్రయోజనాలు:

☛ భారతదేశంలోని అత్యుత్తమ, అతిపెద్ద, వేగవంతమైన 5G నెట్‌వర్క్‌లో 28 రోజుల పాటు అపరిమిత సేవలు

ఇంటికి 50 రోజుల ఉచిత జియోఫైబర్/ఎయిర్‌ఫైబర్ ట్రయల్ కనెక్షన్ (టీవీ + వైఫై + OTT యాప్‌లు)

☛ 50 GB ఉచిత జియో AI క్లౌడ్ స్టోరేజీ

☛ 4K నాణ్యతతో కూడిన టీవీ / మొబైల్‌లో 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్

ఈ ప్రయోజనాలను ఒకే ఆఫర్‌లో అందించడం ద్వారా కొత్త వినియోగదారులకు డిజిటల్ అనుభవాన్ని సులభతరం చేయడం జియో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆఫర్ కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులను, బహుళ ప్లాట్‌ఫామ్‌లలో జియో అనుభవాన్ని అన్వేషించాలనుకునే వారికి విస్తృతంగా ప్రయోజనం చేకూర్చనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న జియో రిటైలర్లు, పార్టనర్ అవుట్‌లెట్‌ల వద్ద ఈ స్టార్టర్ ప్యాక్ అందుబాటులో ఉంటుంది.

మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో జియో ఆధిపత్యం

ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌ (తెలంగాణ, ఏపీ)లో జియో మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ఏప్రిల్ 2025కి విడుదలైన TRAI నివేదిక ప్రకారం.. జియో వైర్‌లెస్‌ మొబిలిటీ, వైర్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్, 5G ఫిక్స్‌డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) విభాగాలలో అద్భుతమైన సబ్‌స్క్రైబర్ వృద్ధిని చూపించింది. అత్యంత పోటీ ఉన్న వైర్లెస్ (మొబైల్) విభాగంలో జియో ఏప్రిల్ 2025లో అత్యధిక నెట్ సబ్‌స్క్రైబర్ జోడింపుతో టాప్‌లో నిలిచింది. TRAI డేటా ప్రకారం, జియో 95,310 కొత్త సబ్‌స్క్రైబర్లను జోడించి, మార్చి 2025లో 3,17,76,074 ఉన్న మొత్తం వినియోగదారులను ఏప్రిల్ 2025లో 3,18,71,384కి పెంచింది. జియో ఫైబర్ లోనూ ఏపీ టెలికాం సర్కిల్‌లో జియో ముందంజలో ఉంది. ఏప్రిల్ 2025లోనే జియో ఫైబర్ 54,000కి పైగా కొత్త సబ్‌స్క్రైబర్లను జోడించి, మొత్తం వైర్‌లైన్‌ సబ్‌స్క్రైబర్ బేస్‌ను సుమారు 1.66 మిలియన్లకు విస్తరించింది.

వేగంగా విస్తరిస్తున్న 5G FWA విభాగంలో జియో ఎయిర్‌ఫైబర్ తెలుగు రాష్ట్రాలలో స్పష్టమైన మార్కెట్ లీడర్‌గా నిలిచింది. ఏప్రిల్ 2025 నాటికి జియో ఎయిర్‌ఫైబర్ దేశవ్యాప్తంగా 6.14 మిలియన్లకి పైగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. ఇందులో పెద్ద భాగం ఏపీ, తెలంగాణ ఉంది. ఏపీ సర్కిల్‌లో జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రైబర్ బేస్ జనవరి 2025లో 427,439 నుండి ఏప్రిల్‌లో 523,000కి పెరిగి, ప్రాంతంలో 80%కి పైగా మార్కెట్ షేర్‌ను దక్కించుకుంది. ఈ వృద్ధికి జియో వేగవంతమైన 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమలు, సరసమైన ధరలు, రూరల్, సెమీ-పట్టణ ప్రాంతాలలో ఫైబర్ కేబుల్స్ వేసే సమస్యలను అధిగమించి హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే సామర్థ్యం కారణమని చెప్పవచ్చు.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *