త్వరలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వైఫై…!

త్వరలో తెలంగాన ఆర్టీసీ బస్సుల్లో వై-ఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ఢిల్లీకి చెందిన ప్రైవేటు సంస్థ, బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో ముందుగా అప్‌లోడ్ చేసిన సినిమాలు, పాటలు అందించడంపై ప్రతిపాదనలు చేసింది. వాటి మధ్యలో వచ్చే వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయం పంచుకోనే విధానంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది.

ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ సంక్షేమంలో ముందుకు వెళ్తున్న తెలంగాణ సర్కార్.. తాజాగా బస్సుల్లో సాంకేతికను పెంచే అంశంపై దృష్టి పెట్టింది. త్వరలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి వై-ఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బస్సుల్లో ఇంటర్నెట్‌ సేవలు అందించడంపై ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఆర్టీసీకి ప్రతిపాదనలు అందజేసింది. ఈ ప్రతిపాదనలపై ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలను అందించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాల్లో వై-ఫై సదుపాయాలను అందించాలని ప్రైవేటు సంస్థ ప్రతిపాదించింది. ఇది సాధారణ ఇంటర్నెట్ యాక్సెస్ కాకుండా.. ముందుగా సెలక్ట్ చేసిన సినిమాలు, సాంగ్స్ వంటి కంటెంట్‌ను ప్యాసింజర్స్ తమ మొబైళ్లలో చూసేలా ఏర్పాటు చేస్తామని పేర్కొంది. వై-ఫై ద్వారా అందించే కంటెంట్ మధ్య అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా వస్తాయి. ఈ ప్రకటనల ద్వారా ప్రైవేటు సంస్థకు ఆదాయం సమకూరుతుందని.. అందులో భాగస్వామ్యంతో ఆర్టీసీకి కూడా ఆర్థిక ప్రయోజనం ఉంటుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

ఈ ప్రతిపాదనలపై మరింత స్పష్టత కోసం త్వరలో ఆ సంస్థ, ఆర్టీసీ మధ్య మరో మీటింగ్ జరగనుంది. ఆ సమావేశం అనంతరం ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన పూర్తి కార్యచరణ రూపొందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మరింత సౌకర్యవంతం అవుతుందని.. ప్రయాణికులు తక్కువ ధరలో వినోదాన్ని ఆస్వాదించగలరని భావిస్తున్నారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *