జగన్‌ రప్పా రప్పా కామెంట్స్‌పై స్పందించిన పవన్ కల్యాణ్

జగన్‌ రప్పా రప్పా కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి.. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని అన్నారు. ఎవరైనా చట్టం, నిబంధనలను పాటించాల్సిందే.. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదన్నారు పవన్‌ కల్యాణ్. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని పవన్ అన్నారు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని స్పష్టం చేశారు. అశాంతిని పెంచడానికి, అభద్రతను కలిగించడానికి మద్దతుగా మాట్లాడుతున్నవారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వారిని ఓ కంట కనిపెట్టాలని సూచించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడేవారి నేరమయ ఆలోచనలను ప్రజలంతా గమనించాలని సూచించారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దని గుర్తు చేశారు పవన్.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *