భక్తులు కావాలంటే 10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. అయితే, లడ్డూల నిల్వను బట్టి ఈ సంఖ్య మారుతుందని గమనించగలరు.. దర్శన టికెట్ లేని వారు ఆధార్ నంబర్ ఉపయోగించి రెండు లడ్డూలు పొందవచ్చు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కియోస్క్‌లు లడ్డూ కౌంటర్ సమీపంలో ఉన్నాయి. MBC విచారణ కేంద్రం, CRO కేంద్రం, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో కూడా కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయి.
తిరుమల వెళ్లే భక్తులకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే..ఇకపై శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు..! తిరుమల లడ్డూ కౌంటర్లలో రద్దీని, సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. డిజిటల్ విధానంలో టిక్కెట్లు కొనుగోలు చేయగల కొత్త కియోస్క్‌లను టిటిడి ఏర్పాటు చేసింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని ఆదివారం ప్రారంభించింది టిటిడి. ఇందుకోసం భక్తులు తమ దర్శన టికెట్ నంబర్‌ను నమోదు చేసి, మీకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి. ఆ రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే లడ్డూలను అందిస్తారు. ఈ విధానాన్ని కొద్ది రోజులు పరిశీలించనున్నారు. ఏవైనా లోటు పాట్లు ఉంటే దాన్ని బట్టి సవరణలు చేస్తారు.
భక్తులు కావాలంటే 10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. అయితే, లడ్డూల నిల్వను బట్టి ఈ సంఖ్య మారుతుందని గమనించగలరు.. దర్శన టికెట్ లేని వారు ఆధార్ నంబర్ ఉపయోగించి రెండు లడ్డూలు పొందవచ్చు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కియోస్క్‌లు లడ్డూ కౌంటర్ సమీపంలో ఉన్నాయి. MBC విచారణ కేంద్రం, CRO కేంద్రం, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో కూడా కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయి.
ఇదిలా ఉంటే, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,254 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చింది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు, టికెట్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.