అరటి కాయతో అద్దిరిపోయే బెనిఫిట్స్‌.. లాభాలు తెలిస్తే తొక్క కూడా వదలిపెట్టరు..!

అరటిపండు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. నీ, పచ్చి అరటిపండ్లు కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా.? చాలా తక్కువ మందికి మాత్రమే అరటి కాయ ప్రయోజనాల గురించి తెలిసి ఉంటుంది. కానీ, పచ్చి అరటికాయతో కూడా పుట్టేడు లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అరటి కాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అరటి కాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది.

అరటి కాయలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతుంది. తద్వారా డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది. అరటి కాయల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది.

అరటి కాయల్లో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును చురుగ్గా మారుస్తాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అరటి కాయలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికలు మెరుగుపర్చి మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.

అరటి కాయల్లో విటమిన్ సి, విటమిన్ బి6 ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మొటిమలు, మచ్చలు లేకుండా చేస్తాయి. అరటి కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కుదుళ్లకు పోషణ అందిస్తాయి. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఈ పచ్చి అరటి కాయతో కొలెస్ట్రాల్ ను నియంత్రించే ఫైబర్ ఉంటుంది. ఇది గుండెను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.. అరటి కాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణాశయంలో అల్సర్ రాకుండా చేయడమే కాకుండా క్యాన్సర్ కణాల పెరుగుదల అడ్డుకుంటుంది.

About Kadam

Check Also

బొద్దింకలను బెదరగొట్టి తరిమికొట్టే సింపుల్‌ టిప్స్‌..ఇలా చేస్తే మీ కిచెన్‌ ఆరోగ్యంగా ఉన్నట్టే..!

బొద్దింకలు ఏం చేస్తాయిలే అనుకుంటే పొరపాటే.. వీటిని లైట్‌ తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల తీవ్రమైన అనారోగ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *