రైతన్నలూ అదిరేటి ఆఫర్ అని టెమ్ట్ అవ్వొద్దు.. పంట పండకపోతే అసలుకే మోసం

వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గత ఏడాది మిర్చి, పొగాకు, వరి వంటి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించలేదు. దీంతో రైతులు కొంతమేర ఆర్థికంగా నష్టపోయారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన వర్షాలతో ముందస్తుగా సాగుకు సిద్దమైనా.. ప్రస్తుతం వానలు లేకపోవడంతో వ్యవసాయ పనులు సాగటం లేదు. దీంతో విత్తనాలకు డిమాండ్ లేకుండా పోయింది. ప్రతి ఏటా ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలు కొనుగోలు చేసి నాటడం కూడా మొదలు పెట్టేవారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో రైతులు సాగు పట్ల విముఖత చూపిస్తున్నారు. ఆర్తికంగా లాభసాటి కాకపోవడం, వాతవరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అన్నదాతల్లో నిర్లిప్తత వ్యక్తమవుతోంది. దీంతో విత్తన కంపెనీల్లో ఆందోళన మొదలైంది. ఆందోళన నుండి బయటపడేందుకు విత్తన కంపెనీలు సరికొత్త ఆలోచనలు చేస్తున్నాయి.

ప్రతి ఏటా విత్తనాల కోసం విపరీతమైన డిమాండ్ ఉండేది.. రైతులు క్యూ లైన్లలో నిలబడి మరీ విత్తనాలు కొనుగోలు చేసేవారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సాగుదార్లను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ లేని విధంగా విత్తన కంపెనీలు ఆఫర్లు ప్రకటించారు. అవి కూడా సదాసీదా ఆఫర్లు కాదు… తమ విత్తనమే కొంటే లక్కీ డ్రాలో బైక్, టివి, ఫ్రిజ్ వంటివి ఇస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఈ మేరకు విత్తనాల షాఫుల వద్ద ప్రత్యేక బ్యానర్లను కూడా ఏర్పాటు చేశాయి.. విత్తన షాపుల యజమానులను ఆకట్టుకునేందుకు కూడా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించినట్లు తెలుస్తోంది.

అయితే.. వ్యవసాయ రంగంలో ఇలాంటి ఆఫర్లను గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నదాతలు అంటున్నారు. గుంటూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి సాగు చేస్తుంటారు. కొన్ని రకాల మిర్చి విత్తనాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రైతుల ఫలానా రకం విత్తనమే కావాలంటూ ఎమ్మెల్యేలు, ఎంపిల చేత రికమండేషన్ చేయించిన పరిస్థితులు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూశాం.. అటువంటి పరిస్థితి నుండి ఇప్పుడే మా విత్తనం కొంటే మేమే లక్కీ డ్రా తీసి బహుమతులు ఇస్తామంటూ ప్రకటించడంపై అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిపిస్తోంది.

అయితే ఈ సీజన్లో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖాధికారులు అంటున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ ఆపర్లు మాటున నకిలీ విత్తనాలు కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే విత్తనాలు కొనుగోలు చేయాలంటున్నారు.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *