కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి. భక్తులు ఈయన్ను పరిపరి విధాలుగా కొలుస్తుంటారు. తిరుమల తిరుపతి నుంచి ద్వారకాతిరుమల వెంకన్న , వాడపల్లి శ్రీనివాసుడు ఇలా ప్రాంతం స్థలం ఏదైనా భక్తుల సేవలు , పూజలు ఆయా ఆలయాల్లో ఘనంగా జరుగుతుంటాయి. సాధారణం ఆలయ , ఆగమ శాస్త్రాల ప్రకారం పూజాదికాలు , అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఏ సీజన్ లో దొరికే పండ్లు ఆ సీజన్ లో శ్రీవారికి సమర్పిస్తారు భక్తులు ఎందుకంటే..
వెంకన్న కొలువు తీరిన ఆలయాల్లో తూర్పు గోదావరి జిల్లా అన్నవరపుపాడు గ్రామం ఒకటి. ఉభయగోదావరిజిల్లాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో అక్కడకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు. ఐతే ఇక్కడ ఆలయానికి ఒక ప్రత్యేకత వుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు కదా. ఇక్కడ స్వామి వారిని వైభవోపేతంగా అలంకరిస్తుంటారు. డాక్టర్లు చెబుతుంటారుకదా .. ఏ సీజన్ లో దొరికే పండ్లు ఆ సీజన్ లో తప్పకుండా తినాలి అని అలాగే … ఈ ఆలయంలో ఏ సీజన్ లో దొరికే పండ్లు , ఫలాల తో ఆ సీజన్ లో ప్రత్యేకం గా అలంకరిస్తుంటారు. వీటిలో పువ్వులు , ధాన్యాలు సైతం ఉంటాయి.
ఐతే ఈ ప్రత్యేక అలంకరణ కేవలం శనివారం మాత్రమే జరుగుతుంది. ఆ రోజు స్వామిని దర్శించుకున్న భక్తులకు అన్నదానం సైతం ఏర్పాటుచేస్తారు. భగవంతుడికి ఏది నైవేద్యం పెట్టినా చివరకు భక్తులకు ప్రసాదంగా మారుతుంది కదా . దీనివల్ల భక్తులకు చక్కటి ఆరోగ్య సందేశం కూడా అందుతుందని స్థానికులు చెప్పుకుంటూవుంటారు.