సుపరిపాలనలో తొలి అడుగు వేదికపై క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఇక ముందు చేయబోయే పనులు, లక్ష్యాలను కూడా వివరించారు. అదే సమయంలో గత ప్రభుత్వ తప్పుడు విధానాలను కూడా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.
డబుల్ ఇంజిన్ సర్కార్‌లో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామన్నారు. ఏడాదిలోనే ఊహించిన దానికంటే ఎక్కువ చేశామని చెప్పారు సీఎం చంద్రబాబు. మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తీసుకొస్తాం. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారాయన రాష్ట్రానికి బనకచర్ల గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందన్నారు సీఎం చంద్రబాబు. గోదావరి నీళ్లు రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చు.. చెరో 200 టీఎంసీలు వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని చెప్పారు. అలాగే ఆడబిడ్డలపై లైంగిక వేధింపులకు పాల్పడితే సహించమని చెప్పారాయన. రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే తన దగ్గర కుదరదన్నారు. డ్రగ్స్ ముఠాలు, మహిళల వేధింపులకు పాల్పడే వారిని ఉపేక్షించమని హెచ్చరించారు.