సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దాన్ని అస్సలు వదిలిపెట్టారు

శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సొరకాయ సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఫైబర్‌తో పాటు, సొరకాయలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు కూడా ఉన్నాయి. మధుమేహ రోగులకు సొరకాయ కూర లేదా రసం చాలా ప్రయోజనకరం. దీన్ని తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉండదు.

కూరగాయలు ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాధించిన వరం భావిస్తారు. ఎందుకంటే వాటిలో వందలాది పోషకాలు ఉంటాయి. అలాంటి కూరగాల్లో ఒకటి సొరకాయ కూడా ఒకటి. సొరకాయను పోషకాల నిధిగా పిలుస్తారు. ఇది అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అందుకే దీనిని ఏడాది పొడవునా తినవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సొరకాయతో చర్మం నుండి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. డైటీషియన్ల ప్రకారం… సొరకాయలో ఫైబర్, నీరు, విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, కాల్షియం, సోడియం వంటి పెద్ద మొత్తంలో పోషకాలు ఉన్నాయని చెబుతారు.

సొరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. సొరకాయలో లభించే విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇనుము హిమోగ్లోబిన్ లోపాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. కాల్షియం ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. సొరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. సొరకాయలో లభించే పోషకాలు డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. గుండె, కాలేయ ఆరోగ్యానికి సొరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.

ప్రతిరోజూ సొరకాయ తినడం వల్ల రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో మంటను తగ్గించడంలో కూడా సొరకాయ సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఫైబర్‌తో పాటు, సొరకాయలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు కూడా ఉన్నాయి. మధుమేహ రోగులకు సొరకాయ కూర లేదా రసం చాలా ప్రయోజనకరం. దీన్ని తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉండదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *