అంతరిక్షం లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరిక్ష పరిశోధ కేంద్రం ISSతో ఫాల్కన్ వ్యోమ నౌక డాకింగ్ విజయవంతం అయ్యింది. బుధవారం(జూన్ 25) శుభాంశు శుక్లా తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్సెంటర్లో చేపట్టిన ఫాల్కన్-9 విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. స్పేస్లో అడుగుపెట్టగానే జైహింద్.. జై భారత్ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు. ISSలో అడుగుపెడుతున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.
నా భుజాలపై త్రివర్ణ పతాకం ఉంది. సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో యాక్సియం-4 ప్రయాణం చేస్తోందన్నారు శుభాంశు శుక్లా. ఈ యాత్ర ఎంతో అద్భుతంగా ఉందని సందేశమిచ్చారు. ప్రతి భారతీయుడి ఆశీస్సులు తనకు కావాలన్నారు. ISSలో శుభాంశు శుక్లా కీలక ప్రయోగాలు చేయబోతున్నారు. మిషన్తో శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు.