పిల్లల కోసం హెల్తీ స్వీట్ రెసిపీ.. రుచి అద్భుతంగా ఉంటుంది..! ఇలా చేస్తే పర్‌ ఫెక్ట్‌ గా వస్తాయి..!

ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయాలంటే మినప సున్నుండలు చాలా మంచి ఆప్షన్. చిన్న పిల్లల ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు, ఖనిజాలు ఇందు లో పుష్కలంగా ఉంటాయి. బాదం, జీడిపప్పు కలిపి చేసిన ఈ స్వీట్లు చాలా రుచికరంగా ఉంటాయి.

ప్రతి ఒక్కరి ఇళ్లలో పిల్లల కోసం వారి ఆరోగ్యం కోసం తప్పకుండా ఒక ప్రత్యేకమైన స్వీట్ చేసి పెడుతారు. ఆ స్వీట్స్ లలో కచ్చితంగా మినప సున్నుండలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్స్. ఈ స్వీట్స్ పిల్లల ఎదుగుదలకు మంచివి. మినుముల్లో ప్రోటీన్, పొటాషియం, ఐరన్, కాల్షియం, బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నెయ్యి శరీరానికి శక్తిని ఇస్తుంది. చక్కెర వెంటనే శక్తిని అందిస్తుంది.

100 గ్రాముల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా..?

  • ప్రొటీన్ – 25 గ్రాములు
  • పొటాషియం – 983 మి.గ్రా.
  • కాల్షియం – 138 మి.గ్రా.
  • ఐరన్ – 7.57 మి.గ్రా.
  • నయాసిన్ (Niacin) – 1.447 మి.గ్రా.
  • థయామిన్ (Thiamine) – 0.273 మి.గ్రా.
  • రిబోఫ్లావిన్ (Riboflavin) – 0.254 మి.గ్రా.

కొంతమంది పిల్లలు నానబెట్టిన బాదం తినరు. దాంతో బాదం పొడి కలిపి సున్నుండలు చేస్తారు. ఈ కొత్త పద్ధతితో చేసిన మినప సున్నుండలు చాలా రుచికరంగా ఉంటాయి. మినుములు ఎలాంటివి అయినా వాడొచ్చు. వేయించిన మినుములే ఎక్కువ రుచిగా ఉంటాయి. జీడిపప్పు, బాదం కలిపితే రంగు కూడా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ రెసిపీ చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

  • మినుములు – 1 కప్పు (వేయించినవి)
  • జీడిపప్పు – 1 కప్పు (వేయించినవి)
  • బాదం – 1 కప్పు (వేయించినవి)
  • చక్కెర – 1 కప్పు
  • కరిగించిన నెయ్యి – 1 కప్పు

తయారీ విధానం

ముందుగా నెయ్యిని పక్కన పెట్టుకుని మిగతా అన్ని పదార్థాలను (మినుములు, జీడిపప్పు, బాదం, చక్కెర) విడివిడిగా పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పొడులన్నింటినీ ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా ఈ పొడి మిశ్రమంలో పోస్తూ.. చేతితో చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మినప సున్నుండలను గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే.. అవి నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ స్వీట్ ను పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి.

రెసిపీకి సంబంధించి చిట్కాలు

  • చక్కెర బదులు బెల్లాన్ని వాడవచ్చు.
  • నెయ్యి ఎక్కువ అయితే లడ్డూలు గుండ్రంగా రావు.. కాబట్టి తగినంత మాత్రమే వాడండి.
  • బాదం, జీడిపప్పు తియ్యగా ఉంటాయి. కాబట్టి చక్కెర కొంచెం తక్కువ వేసినా సరిపోతుంది.
  • మినుములు తక్కువ మంటపై మెల్లగా వేయించండి. అప్పుడు మాత్రమే అసలైన రుచి వస్తుంది.

About Kadam

Check Also

కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *