బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌ను తరలించండి.. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భయాందోళన..

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత.. దేశంలోని ఎయిర్ పోర్టుల సమీపంలో నివాసం ఉండే ప్రజలు వణికిపోతున్నారు. సాధారణంగానే ఫ్లైట్స్ టేకాఫ్‌, ల్యాండింగ్ సమయంలో పెద్ద శబ్దం చేస్తుంటాయి. ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ సమీపంలో నివాసం ఉండే వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం. ఇక.. అహ్మదాబాద్‌ ప్రమాదం తర్వాత.. ఎయిర్‌పోర్టుల సమీపంలో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే.. DGCAకి కంటోన్మెంట్ వికాస్ మంచ్ లేఖ రాసింది. బేగంపేట ఎయిర్ పోర్ట్ తరలించాలని డిమాండ్ చేసింది. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌ను దుండిగల్‌కు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎయిర్‌పోర్ట్ సమీపంలో చెట్లు, భారీ భవనాలు తొలగించాలని DGCA ఆదేశాలు ఇచ్చింది.

DGCA ఆదేశాలతో ఆందోళనలో బేగంపేట్‌ ప్రజలున్నారు. అంటే.. తమకూ రిస్క్‌ ఉన్నట్లే అని భయపడుతున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ఏర్పడ్డాక.. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు కాస్త విమానాలు తగ్గినా.. సిటీకి వచ్చే వీఐపీలు, సీఎంలు, కేంద్రమంత్రుల రాకపోకలు మాత్రం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచే సాగిస్తున్నారు. దీనికి తోడు.. ఐఏఎఫ్ ట్రైనింగ్ విమానాలు, హెలికాప్టర్ల సర్వీసులు బేగంపేట్‌లో ఎక్కువ నడుస్తున్నా్యి. సో.. చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, ఎయిర్‌పోర్టును దుండిగల్‌కు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు బేగంపేట్ వాసులు.

అహ్మదాబాద్‌ లాంటి ప్రమాద ముప్పు నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఎక్కువగా ఉపయోగం లేని ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసులు బంద్ చేయాలని, దగ్గరలో ఉన్న ఎయిర్‌పోర్టులకు సర్వీసులు మళ్లించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బేగంపేట్ వాసుల లేఖపై కేంద్రం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది?. ప్రజల విజ్ఞప్తి మేరకు.. నిజంగానే ఎయిర్ పోర్ట్ నుంచి విమాన రాకపోకలు దుండిగల్‌కు తరలిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.


About Kadam

Check Also

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *