ఆరోగ్య శాఖలో ఒకేసారి రెండు జాబ్‌ నోటిఫికేషన్లు.. నిరుద్యోగులకు పండగే!

రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, స్పీచ్‌ పాథాలజిస్టు పోస్టులతోపాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు..

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం రెండు రకాల నోటిఫికేషన్లను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, స్పీచ్‌ పాథాలజిస్టు పోస్టులు భర్తీ చేయనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 48, స్పీచ్‌ పాథాలజీ పోస్టులు 4 వరకు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పాథాలజీ పోస్టులకు జూలై 12 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డెంటల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు జూలై 14 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ సంప్రదించాలని సూచించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టరేట్‌ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి వైద్యనియామక బోర్డు మరో నోటిఫికేషన్‌ జారీ చేసింది. వైద్య విద్యలో నాణ్యత పెంచడానికి, బోధనాసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు మల్టీజోన్‌ 1, 2 కలిపి వివిధ విభాగాల్లో మొత్తం 607 పోస్టులను భర్తీ చేయనుంది. వీటితోపాటు 48 డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు కూడా ప్రభుత్వం ప్రకటన జారీ చేయడంతో 655 పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జులై 10 నుంచి 17 సాయంత్రం 5 గంటల్లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బోర్డు మెంబర్‌ సెక్రటరీ తెలిపారు. జులై 18 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులోకి తీసుకువస్తారు.

మొత్తం 34 స్పెషాలిటీల్లో మల్టీజోన్‌ 1లో 379, మల్టీజోన్‌ 2లో 228 పోస్టులు భర్తీ చేయనున్నారు. అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికైన వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి వీల్లేదని బోర్డు తేల్చి చెప్పింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2025, జులై 1 నాటికి 46 ఏళ్లు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకంలో ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులు, తదితర చోట్ల విధులు నిర్వహిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ వైద్యులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందని తెల్పింది. మొత్తం 100 పాయింట్లలో 80 శాతం అకడమిక్‌ మార్కులకు, 20 శాతం వెయిటేజీకి కేటాయిస్తారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *