రైల్వే అభ్యర్ధులకు అలర్ట్‌.. ఆర్‌ఆర్‌బీ లోకో పైలట్‌ రాత పరీక్ష షెడ్యూల్‌ వచ్చేసింది!

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను నోటిఫికేషన్‌లో బోర్డు పేర్కొనలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఆర్‌ఆర్‌బీ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పరీక్ష జులై 15వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. పరీక్షకు పది రోజుల ముందుగా సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను జారీ చేస్తారు. అనంతరం పరీక్షకు 4 రోజులు ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ మేరకు సూచనలు పాటించాలని బోర్డు తెలిపింది. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చెక్‌ చేయవచ్చు.

కాగా ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.. రైల్వే రీజియన్లలో భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష అనంతరం వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

తెలంగాణ ఇంటర్‌ రెండో విడత ప్రవేశాల తుది గడువు ఇదే

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల్లో రెండో విడత కింద జులై 31వ తేదీ వరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో తెలిపారు. తొలి విడత ప్రవేశాలు మే 1వ తేదీన ప్రారంభం జూన్‌ 30వ తేదీతో గడువు ముగియనుంది. ఈ క్రమంలో రెండో విడత ప్రవేశాలకు గడువు జులై 31వ తేదీగా నిర్ణయించామన్నారు. విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *