అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. కోర్సుల వారీగా ఫీజుల ఇవే

హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ.. 2025-26 విద్యా సంత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీలోను అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద బీఏ, బీకామ్‌, బీఎస్సీ వంటి యూజీ కోర్సుల్లో, ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్‌సీ, బీఎల్‌ఐఎస్‌సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ మీడియంలలో ప్రవేశాలు కల్పిస్తారు.

డిగ్రీలో ప్రవేశాలు పొందగోరే వారికి ఇంటర్మీడియట్‌, పీజీలో ప్రవేశాలకు యూజీలో అర్హత కలిగి ఉండాలి. అలాగే సర్టిఫికెట్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌ లేదా పదో తరగతితోపాటు ఏదైనా ప్రైవేట్‌ ఆర్గనైజేషన్‌లో కనీసం మూడేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. ఆయా కోర్సులు పూర్తి చేయడానికి 6 నెలలు, ఏడాది, మూడేళ్లు, నాలుగేళ్ల వరకు వ్యవధి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్‌ 14, 2025వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 13, 2025 వరకు నిర్ణయించారు. ఎలాంటి ఎంట్రన్స్‌ టెస్ట్ లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. అంబేద్కర్‌ యూనివర్సిటీలో www.braouonline.inwww.braou.ac.in ప్రవేశాలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఇక్కడ చేసుకోవచ్చు. ఆయా కోర్సులకు సంబంధించిన అర్హతలు, ఫీజుల వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

About Kadam

Check Also

చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష..

చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇంటిబయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి మాయమాటలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *