బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. నెక్స్ట్ ఏం జరగనుంది..

బనకచర్ల ప్రాజెక్ట్‌తో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు చేసిన ఫిర్యాదుల ప్రభావం కనిపిస్తోంది. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌కు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై పలు సందేహాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్ట్‌కు ఇప్పుడే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ వెనక్కి పంపింది. అంతే కాకుండా ఏపీ ప్రభుత్వానికి మూడు కీలక సూచనలు చేసింది.1. ప్రాజెక్టు ప్రతిపాదకులు (PP) కేంద్ర జల సంఘం (CWC) సహాయంతో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలి. 2. గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అవార్డ్1980కి విరుద్ధంగా ఉందన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలి. 3. టెర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌ (TOR ) తయారీకి ముందు రాష్ట్రాల మధ్య జల పంపిణీపై క్లారిటీ కోసం కేంద్ర జల కమిషన్ అనుమతి తీసుకోవాలని కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ తెలిపింది.

సముద్రంలో కలిసే గోదావరి నది మిగుల జలాలను మళ్లించి.. రాయలసీమ జిల్లాలకు అందించాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకోసం బనకచర్ల ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఏపీ చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి పలువురి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. అనంతరం ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోపాటు పలు శాఖల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణగా వివరించారు. దీంతో పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌కు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్..

మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి తెలంగాణ కేబినెట్‌ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ఎంపీలనుంచి తీసుకున్న సూచనలు, అభిప్రాయాలతో పాటు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు.. భవిష్యత్‌ ప్రణాళికలను సీఎం రేవంత్, ఉత్తమ్‌ పవర్‌ పాయింజ్‌ ప్రజెంటేషన్‌లో వివరించనున్నారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *